ప్రజ్ఞానంద వెనుకంజ

మెల్ట్‌వాటర్‌ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నమెంట్‌ ఫైనల్లో భారత యువ కెరటం ప్రజ్ఞానంద వెనుకబడ్డాడు. ప్రపంచ రెండో ర్యాంకర్‌ డింగ్‌ లీరెన్‌ (చైనా)తో ఆఖరి సమరంలో తొలిరోజు, గురువారం ప్రజ్ఞానంద 1.5-2.5తో నిలిచాడు. ఈ పోరులో భారత టీనేజర్‌

Updated : 27 May 2022 04:09 IST

చెన్నై: మెల్ట్‌వాటర్‌ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నమెంట్‌ ఫైనల్లో భారత యువ కెరటం ప్రజ్ఞానంద వెనుకబడ్డాడు. ప్రపంచ రెండో ర్యాంకర్‌ డింగ్‌ లీరెన్‌ (చైనా)తో ఆఖరి సమరంలో తొలిరోజు, గురువారం ప్రజ్ఞానంద 1.5-2.5తో నిలిచాడు. ఈ పోరులో భారత టీనేజర్‌ తొలి గేమ్‌ కోల్పోయినా రెండో గేమ్‌ను గెలిచి స్కోరు సమం చేశాడు. కానీ మూడో గేమ్‌ను సొంతం చేసుకుని మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లిన లీరెన్‌.. నాలుగో గేమ్‌ను 39 ఎత్తుల్లో డ్రా చేసుకుని ఆధిక్యాన్ని మరింత పెంచుకున్నాడు. రెండోరోజు ఆటలో ప్రజ్ఞానంద-లీరెన్‌ నాలుగు గేమ్‌లు ఆడతారు. ఈ నాలుగింట్లో ఫలితం తేలకపోతే టైబ్రేకర్‌ నిర్వహిస్తారు. ఈ టోర్నీలో అద్భుతమైన ఫామ్‌లో  ఉన్న ప్రజ్ఞానంద.. ఫైనల్‌ చేరే క్రమంలో ప్రపంచ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌తో పాటు అనుభవజ్ఞుడైన అనీష్‌ గిరికి షాకిచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని