శ్రీశంకర్‌ ఖాతాలో పసిడి

 భారత లాంగ్‌జంప్‌ స్టార్‌ మురళీ శ్రీశంకర్‌ మెరిశాడు. గ్రీస్‌లో జరుగుతున్న అంతర్జాతీయ జంపింగ్‌ మీటింగ్‌లో అతడు స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఈ ఈవెంట్లో శ్రీశంకర్‌ 8.31 మీటర్ల దూరం దూకి అగ్రస్థానంలో నిలిచాడు. అతడి జాతీయ రికార్డు (8.36 మీ) కన్నా ఇది

Updated : 27 May 2022 04:09 IST

దిల్లీ: భారత లాంగ్‌జంప్‌ స్టార్‌ మురళీ శ్రీశంకర్‌ మెరిశాడు. గ్రీస్‌లో జరుగుతున్న అంతర్జాతీయ జంపింగ్‌ మీటింగ్‌లో అతడు స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఈ ఈవెంట్లో శ్రీశంకర్‌ 8.31 మీటర్ల దూరం దూకి అగ్రస్థానంలో నిలిచాడు. అతడి జాతీయ రికార్డు (8.36 మీ) కన్నా ఇది తక్కువే. ఇదే పోటీల్లో మోంట్‌లర్‌ (స్వీడన్‌, 8.27 మీ) రజతం గెలవగా, జులెస్‌ (ఫ్రాన్స్‌, 8.17 మీ) కాంస్యం సాధించాడు. ఈ పోటీల్లో శ్రీశంకర్‌తో పాటు మోంట్‌లర్‌, జులెస్‌ మాత్రమే 8 మీటర్ల దూరం దూకడం విశేషం. టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడిన తర్వాత శ్రీశంకర్‌ ఆడిన తొలి ఔట్‌డోర్‌ అంతర్జాతీయ ఈవెంట్‌ ఇదే. ఇటీవల కొజికోడ్‌లో జరిగిన ఫెడరేషన్‌ కప్‌లో తన జాతీయ రికార్డును తానే అధిగమించాడీ అథ్లెట్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు