ప్రతీకారానికి వేళాయె

ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్లో భారత్‌ ప్రతీకారానికి సిద్ధమైంది. గ్రూప్‌ దశలో జపాన్‌ చేతిలో ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం మన జట్టుకు వచ్చింది. శనివారం సూపర్‌-4 మ్యాచ్‌లో జపాన్‌తో భారత్‌ తలపడనుంది. లీగ్‌ దశలో మొదట పాకిస్థాన్‌తో డ్రా చేసుకున్న భారత్‌.. రెండో మ్యాచ్‌లో 2-5తో జపాన్‌ చేతిలో

Published : 28 May 2022 03:06 IST

నేడే జపాన్‌తో భారత్‌ సూపర్‌-4 పోరు

 ఆసియాకప్‌ హాకీ

జకర్తా: ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్లో భారత్‌ ప్రతీకారానికి సిద్ధమైంది. గ్రూప్‌ దశలో జపాన్‌ చేతిలో ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం మన జట్టుకు వచ్చింది. శనివారం సూపర్‌-4 మ్యాచ్‌లో జపాన్‌తో భారత్‌ తలపడనుంది. లీగ్‌ దశలో మొదట పాకిస్థాన్‌తో డ్రా చేసుకున్న భారత్‌.. రెండో మ్యాచ్‌లో 2-5తో జపాన్‌ చేతిలో ఓడి నాకౌట్‌ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. కానీ అద్భుతంగా పుంజుకున్న భారత జట్టు.. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో 16-0తో ఇండోనేసియాను చిత్తు చిత్తుగా ఓడించి నాకౌట్‌కు అర్హత సాధించింది. భారత్‌, జపాన్‌తో పాటు మలేసియా, దక్షిణ కొరియా సూపర్‌-4లో ఆడనున్నాయి. ప్రతి జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడనుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు టైటిల్‌ కోసం ఫైనల్లో తలపడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని