Published : 28 May 2022 03:06 IST

ప్రజ్ఞానందకు నిరాశ

 టైబ్రేకర్‌లో ఓటమి

 మెల్ట్‌వాటర్‌ చెస్‌

చెన్నై: భారత యువ కెరటం ప్రజ్ఞానందకు నిరాశ. మెల్ట్‌వాటర్‌ ఛాంపియన్స్‌ చెస్‌ టూర్‌ టోర్నీలో అతడు కొద్దిలో టైటిల్‌ను చేజార్చుకున్నాడు. డింగ్‌ లీరెన్‌ (చైనాతో) తుది పోరులో తొలి సెట్లో 1.5-2.5తో వెనకబడిన ఈ భారత టీనేజర్‌.. రెండో సెట్లో 2.5-1.5తో నెగ్గి స్కోరు సమం చేశాడు. నాలుగు గేమ్‌ల ఈ రెండో సెట్లో తొలి గేమ్‌ను డ్రా చేసుకున్న భారత గ్రాండ్‌మాస్టర్‌.. ఆ తర్వాత గేమ్‌ను నెగ్గి ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత రెండు గేమ్‌లు డ్రా కావడంతో ప్రజ్ఞ పైచేయి సాధించాడు. కానీ విజేతను తేల్చడం కోసం నిర్వహించిన బ్లిట్జ్‌ టైబ్రేకర్‌లో భారత స్టార్‌ తడబడ్డాడు. రెండు గేమ్‌ల టైబ్రేక్‌లో తొలి గేమ్‌ డ్రాగా ముగియగా.. రెండో గేమ్‌లో అనుభవాన్ని రంగరిస్తూ లీరెన్‌.. ప్రజ్ఞపై నెగ్గాడు. ఈ గేమ్‌ను 49 ఎత్తుల్లో గెలిచిన లీరెన్‌ గేమ్‌తో పాటు టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే)తో పాటు అనీష్‌ గిరి (నెదర్లాండ్స్‌)ను ప్రజ్ఞానంద కంగుతినిపించిన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని