Kiran Navgire: ధోని స్ఫూర్తితోనే సిక్స్‌లు కొడుతున్నా: కిరణ్‌ నవ్‌గిరె

2011 ప్రపంచకప్‌ను గెలిపిస్తూ ధోని కొట్టిన సిక్సర్‌ తనలో స్ఫూర్తినింపిందని అందుకే అతడి బాటలోనే ధాటిగా బ్యాటింగ్‌ చేయడాన్ని అలవాటు చేసుకున్నానని చెబుతోంది మహారాష్ట్ర బ్యాటర్‌ కిరణ్‌ నవ్‌గిరె. సోలాపుర్‌కు చెందిన కిరణ్‌..  మహిళల

Updated : 28 May 2022 07:36 IST

(Photo: Kiran Navgire Instagram)

పుణె: 2011 ప్రపంచకప్‌ను గెలిపిస్తూ ధోని కొట్టిన సిక్సర్‌ తనలో స్ఫూర్తినింపిందని అందుకే అతడి బాటలోనే ధాటిగా బ్యాటింగ్‌ చేయడాన్ని అలవాటు చేసుకున్నానని చెబుతోంది మహారాష్ట్ర బ్యాటర్‌ కిరణ్‌ నవ్‌గిరె. సోలాపుర్‌కు చెందిన కిరణ్‌..  మహిళల టీ20 ఛాలెంజర్‌ టోర్నీలో వెలాసిటీ తరఫున హర్మన్‌ప్రీత్‌ జట్టుపై 34 బంతుల్లోనే 69 పరుగులు సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో అయిదు సిక్సర్లు ఉన్నాయి. ‘‘సిక్స్‌లు కొడుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ధోని సార్‌లా మ్యాచ్‌లను ముగించడాన్ని ఇష్టపడతా. 2011 ప్రపంచకప్‌ ఫైనల్లో ధోని సార్‌ కొట్టిన ఆ చివరి సిక్సర్‌ నా మనసులో ఉండిపోయింది. క్రికెటర్‌గా ఎదగడంలో ఎంతో స్ఫూర్తినిచ్చింది’’ అని కిరణ్‌ చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని