ఇన్ని తప్పులు కోహ్లి ఎప్పుడూ చేయలేదు

ఈ టీ20 లీగ్‌ సీజన్‌లో చేసినన్ని తప్పులు విరాట్‌ కోహ్లి తన 14 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ చేయలేదని భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. ‘‘ఈ సీజన్లో ఆడిన కోహ్లి మనకు తెలిసిన కోహ్లి కాదు. ఎందుకంటే తన 14 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ చేయనన్ని....

Updated : 29 May 2022 03:05 IST

దిల్లీ: ఈ టీ20 లీగ్‌ సీజన్‌లో చేసినన్ని తప్పులు విరాట్‌ కోహ్లి తన 14 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ చేయలేదని భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. ‘‘ఈ సీజన్లో ఆడిన కోహ్లి మనకు తెలిసిన కోహ్లి కాదు. ఎందుకంటే తన 14 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ చేయనన్ని తప్పులు ఈ ఒక్క సీజన్లోనే విరాట్‌ చేశాడు. పరుగులు సాధించనప్పుడు ఇలాంటి తప్పులు జరుగుతుంటాయి. అయితే వీలైనంత త్వరగా పరుగులు సాధించే మార్గాలను అన్వేషించాలి. ఈ సీజన్లో కోహ్లి దాదాపు అన్ని రకాలుగా ఔటయ్యాడు. అతడు తన అభిమానులందరిని తీవ్రంగా నిరాశ పరిచాడు. కీలక మ్యాచ్‌ల్లో కోహ్లి పూర్తిగా విఫలమయ్యాడు’’ అని వీరూ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని