343 జట్లు.. 187 దేశాలు

భారత్‌ వేదికగా జులై 28న ఆరంభమయ్యే చెస్‌  ఒలింపియాడ్‌లో రికార్డు స్థాయిలో 187 దేశాల నుంచి 343 జట్లు పోటీపడబోతున్నాయి.

Published : 29 May 2022 02:19 IST

చెన్నై: భారత్‌ వేదికగా జులై 28న ఆరంభమయ్యే చెస్‌  ఒలింపియాడ్‌లో రికార్డు స్థాయిలో 187 దేశాల నుంచి 343 జట్లు పోటీపడబోతున్నాయి. ఓపెన్‌ విభాగంలో 189, మహిళల కేటగిరిలో 154 జట్లు బరిలో ఉన్నాయి. 2018లో జార్జియాలోని బటూమిలో జరిగిన ఒలింపియాడ్‌లో 179 దేశాల నుంచి 334 (184 ఓపెన్‌, 150 మహిళలు) జట్లు పోటీపడడమే ఇప్పటిదాకా రికార్డుగా ఉంది. అత్యధిక రేటింగ్‌ ఉన్న మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే, 2864) ఈసారి ఒలింపియాడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాడు. ఆతిథ్య హోదాలో భారత్‌ ప్రతి విభాగంలో రెండేసి జట్లను బరిలో దించుతోంది. విదిత్‌ గుజరాతి, నిహాల్‌ సరీన్‌, పెంటేల హరికృష్ణ, అర్జున్‌ ఇరిగేశి, ప్రజ్ఞానంద, గుకేశ్‌, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి లాంటి వాళ్లు జట్టులో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని