Published : 29 May 2022 02:21 IST

ప్రపంచకప్‌కు సురేఖ

హైదరాబాద్‌: పారిస్‌లో జూన్‌ 21న ఆరంభమయ్యే ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-3 టోర్నమెంట్‌తో పాటు ప్రపంచ క్రీడలకు తెలుగమ్మాయి జ్యోతి సురేఖ  ఎంపికైంది. భారత క్రీడా ప్రాధికార సంస్థ, సోనెపట్‌లో నిర్వహించిన సెలక్షన్‌ ట్రయల్స్‌లో సత్తా చాటిన జ్యోతి భారత జట్టులో చోటు సంపాదించింది. ఆర్చరీ ప్రపంచ క్రీడలు జులై 7న బర్మింగ్‌హామ్‌లో మొదలవుతాయి. ప్రపంచ క్రీడలకు ఎంపికైన తొలి ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌గా సురేఖ ఘనత సాధించింది. ప్రస్తుతం కాంపౌండ్‌ సింగిల్స్‌ ప్రపంచ  ర్యాంకింగ్స్‌లో జ్యోతి మూడో స్థానంలో ఉంది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని