Rafael Nadal: ఏ బిడ్డా.. ఇది నా అడ్డా..
ఎదురులేని క్లే కింగ్
రఫా ఖాతాలో 14వ ఫ్రెంచ్ టైటిల్
ఫైనల్లో రూడ్‌పై అలవోక విజయం
పారిస్
ఎక్కడ 2005.. ఎక్కడ 2022
కానీ కాలంతో సంబంధం లేకుండా అతడు మాత్రం అలాగే ఉన్నాడు. ఎర్రమట్టి కోర్టులో అదే దూకుడు, అదే కసి, అదే పట్టుదల! ఆశ్చర్యమేమీ లేదు.. ఊహించనిదేదీ జరగలేదు. విజేత మళ్లీ అతడే. ఇష్టమైన కోర్టులో మరోమారు చెలరేగిన రఫా.. 14వసారి ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీని కొరికేశాడు.
నాదల్కు పోటీనే లేదు. 36 ఏళ్ల వయసులో కూడా పదునైన ఆటతో సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. తన అడ్డాలో మరొకరి చోటు లేదంటూ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డ అతడు.. ఏకపక్ష ఫైనల్లో 23 ఏళ్ల కాస్పర్ రూడ్‌ను అలవోకగా మట్టికరిపించాడు.
22వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను చేజిక్కించుకోవడం ద్వారా అత్యధిక మేజర్ టైటిళ్ల విజేతగా తన రికార్డును రఫా మరింత బలోపేతం చేసుకున్నాడు. అంతే కాదు.. రొలాండ్ గారోస్‌లో టైటిల్ నెగ్గిన అతి పెద్ద వయస్కుడిగా అతను ఘనత సాధించాడు.
రఫెల్ నాదల్‌దే ఫ్రెంచ్ ఓపెన్. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన రఫా ఆదివారం జరిగిన ఫైనల్లో 6-3, 6-3, 6-0తో నార్వే కుర్రాడు కాస్పర్ రూడ్‌పై అలవోకగా విజయం సాధించాడు. రెండో సెట్లో కాసేపు మినహాయిస్తే రఫా జోరు ముందు రూడ్ తేలిపోయాడు. మ్యాచ్‌లో నాదల్ 37 విన్నర్లు కొట్టగా.. రూడ్ 16 విన్నర్లే కొట్టాడు. నాదల్ కేవలం 18 అనవసర తప్పిదాలు చేయగా.. రూడ్ 26 అనవసర తప్పిదాలతో దెబ్బతిన్నాడు. మ్యాచ్‌లో అయిదో సీడ్ నాదల్ మొత్తం ఎనిమిది బ్రేక్‌లు సాధించగా.. ఎనిమిదో సీడ్ రూడ్ రెండు సార్లు మాత్రమే రఫా సర్వీసును బ్రేక్ చేయగలిగాడు. నాదల్ తొలిసారి 19 ఏళ్ల వయసులో, 2005లో ఇక్కడ విజేతగా నిలిచాడు. రొలాండ్ గారోస్‌లో 115 మ్యాచ్‌ల్లో కేవలం మూడుసార్లు మాత్రమే ఓడిపోయాడంటే అతడి ఆధిపత్యం ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. అదే ఫైనల్లోనైతే ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఎవరూ కూడా నాదల్ (14 ఫ్రెంచ్ టైటిళ్లు) కన్నా ఎక్కువసార్లు ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో విజేతగా నిలవలేదు. ఇతర దిగ్గజాలు ఫెదరర్, జకోవిచ్ కన్నా అతడిప్పుడు రెండు టైటిళ్లు ముందున్నాడు. రఫా తన తొలి టైటిల్‌ను కూడా జూన్ 5 (2005)నే సాధించడం విశేషం. ప్రస్తుత టోర్నీలో అతడు మూడు సెట్లు మాత్రమే కోల్పోయాడు.
నాదల్ జోరు: క్లే కింగ్ నాదల్, తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన రూడ్ మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా మొదలైంది. బ్రేకులే, బ్రేకులు. తొలి నాలుగు గేముల్లో మూడు సార్లు సర్వీస్ బ్రేకైంది. అయితే ఎప్పటిలాగే నాదల్‌దే పైచేయి. తొలి గేమ్‌లో అలవోకగా సర్వీసును నిలబెట్టుకున్న నాదల్.. రెండో గేమ్‌లో చెలరేగిపోయాడు. నెట్దగ్గరికి వచ్చి దూరంగా బంతిని స్మాష్ చేసి బ్రేక్ పాయింట్ సాధించిన అతడు.. ఓ కళ్లు చెదిరే క్రాస్ కోర్ట్ షాట్‌తో ప్రత్యర్థి సర్వీసును బ్రేక్ చేసి 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. కానీ మూడో గేమ్‌లో తడబడ్డాడు. నాదల్ వరుసగా రెండు డబుల్ ఫాల్ట్‌లు చేయడంతో 40-15తో ఆధిక్యంలోకి వెళ్లిన రూడ్.. అవకాశాన్ని ఉపయోగించుకుని బ్రేక్ సాధించాడు. అయితే అతడి సంతోషం ఎంతోసేపు నిలవలేదు. నెట్ దగ్గరికి దూసుకొస్తూ రూడ్ దూకుడు ప్రదర్శించినా.. అనవసర తప్పిదాలు చేశాడు. ఫలితంగా నాదల్ నాలుగో గేమ్‌లో బ్రేక్ సాధించాడు. అక్కడి నుంచి అలవోకగా సర్వీసు నిలబెట్టుకుంటూ సెట్‌ను చేజిక్కించుకున్నాడు. కానీ రెండో సెట్లో రూడ్ పుంజుకున్నాడు. మరింత ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. అదే సమయంలో నాదల్‌లో కాస్త దూకుడు తగ్గింది. నాదల్ డబుల్ ఫాల్ట్‌ను సొమ్ము చేసుకుంటూ నాలుగో గేమ్‌లో బ్రేక్ సాధించిన రూడ్.. 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. కానీ చిత్రంగా మ్యాచ్‌లో అతడు గెలిచిన చివరి గేమ్ అదే. వెనుకబడడానికి ఇష్టపడని నాదల్ బలంగా పుంజుకున్నాడు. మామూలుగా కాదు. నిర్దాక్షిణ్యంగా చెలరేగిన అతడు వరుసగా 11 గేములు నెగ్గి ఛాంపియన్‌షిప్‌ను చేజిక్కించుకున్నాడు. నాదల్ బలమైన ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ షాట్లతో దూసుకుపోతుంటే.. రూడ్ నుంచి కనీస ప్రతిఘటనే కరవైంది. నాదల్ చక్కని క్రాస్ కోర్టు షాట్లూ ఆడాడు. రూడ్ సర్వీసులు తేలిపోయాయి. వరుసగా అయిదు గేములతో రెండో సెట్‌ను చేజిక్కించుకున్న నాదల్.. మూడో సెట్లో మరింత రెచ్చిపోయాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. అలవోకగా సర్వీసు నిలబెట్టుకున్న అతడు.. రెండు, నాలుగు, ఆరో గేముల్లో బ్రేక్ సాధించి మ్యాచ్‌ను ముగించాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Revanth reddy: మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్‌కు చాలా కీలకం: రేవంత్‌రెడ్డి
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట: ఈవో
-
Movies News
#NBK108: బాలయ్య - అనిల్ రావిపూడి కాంబో.. ఇంట్రో బీజీఎం అదిరిందిగా!
-
Movies News
ఆ సినిమా చూశాక నన్నెవరూ పెళ్లి చేసుకోరని అమ్మ కంగారు పడింది: ‘MCA’ నటుడు
-
India News
CJI: ప్లీజ్.. మాస్కులు పెట్టుకోండి.. లాయర్లకు సీజేఐ సూచన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
- Vishal: షూటింగ్లో ప్రమాదం.. నటుడు విశాల్‌కు తీవ్ర గాయాలు
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- Hanumakonda: రైలెక్కించి పంపారు.. కాగితాల్లో చంపారు
- Lal Singh Chaddha: రివ్యూ: లాల్ సింగ్ చడ్డా
- Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
- IT Raids: వ్యాపారి ఇళ్లల్లో నోట్ల గుట్టలు.. లెక్కించడానికే 13 గంటలు!
- Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?
- సెక్స్ కోరే అమ్మాయిలు వేశ్యలతో సమానం: నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు
- Rohit sharma: ఈ ప్లాన్‌తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ