Harbhajan Singh: తప్పు దిద్దుకునే అవకాశం వస్తే శ్రీశాంత్‌తో.. : హర్భజన్‌

ఒక తప్పును సరిదిద్దుకునే అవకాశం వస్తే అది శ్రీశాంత్‌తో తాను దురుసుగా ప్రవర్తించిన ఉదంతాన్నే అని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు హర్భజన్‌సింగ్‌ అన్నాడు. 2008 ఆరంభ సీజన్‌లో ముంబయికు భజ్జీ.. పంజాబ్‌కు శ్రీశాంత్‌...

Updated : 06 Jun 2022 10:02 IST

దిల్లీ: ఒక తప్పును సరిదిద్దుకునే అవకాశం వస్తే అది శ్రీశాంత్‌తో తాను దురుసుగా ప్రవర్తించిన ఉదంతాన్నే అని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు హర్భజన్‌సింగ్‌ అన్నాడు. భారత టీ20 లీగ్‌ 2008 ఆరంభ సీజన్‌లో ముంబయికు భజ్జీ.. పంజాబ్‌ తరఫున శ్రీశాంత్‌ ప్రాతినిధ్యం వహించారు. మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో ముంబయిపై పంజాబ్‌ నెగ్గింది. మ్యాచ్‌ అనంతరం ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో శ్రీశాంత్‌ను భజ్జీ చెంప దెబ్బ కొట్టడం పెద్ద దుమారమే రేపింది. దీనిపై ఇప్పుడు స్పందిస్తూ.. ‘‘జరిగింది తప్పు. నేను పొరపాటు చేశా. నా వల్ల సహచరుడు ఇబ్బంది పడాల్సి వచ్చింది. నేనూ సిగ్గుపడ్డాను. నేను ఒక తప్పును సరిదిద్దుకోవాల్సి వస్తే అది మైదానంలో శ్రీశాంత్‌తో ప్రవర్తించిన తీరులోనే. ఆ సంఘటన గురించి ఆలోచించినప్పుడు అలా జరగాల్సింది కాదని అనిపిస్తుంది’’ అని భజ్జీ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని