బరిలో నాలుగు.. దక్కేది ఎవరికో?

 టీ20 లీగ్‌కు రూ.వేల కోట్ల ఆదాయాన్ని అందించే మీడియా ప్రసార హక్కుల వేలానికి సర్వం సిద్ధమైంది. తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ- వేలం ఆదివారం ఆరంభమవుతుంది. 2023- 2027కి గాను అంటే అయిదేళ్ల కాలానికి మీడియా హక్కుల కోసం

Published : 12 Jun 2022 02:54 IST

నేటి నుంచే టీ20 లీగ్‌ మీడియా హక్కుల ఈ- వేలం

దిల్లీ:  టీ20 లీగ్‌కు రూ.వేల కోట్ల ఆదాయాన్ని అందించే మీడియా ప్రసార హక్కుల వేలానికి సర్వం సిద్ధమైంది. తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ- వేలం ఆదివారం ఆరంభమవుతుంది. 2023- 2027కి గాను అంటే అయిదేళ్ల కాలానికి మీడియా హక్కుల కోసం దిగ్గజ సంస్థలు పోటీపడుతున్నాయి. అందుకోసం రూ.వేల కోట్లు చెల్లించేందుకూ సై అంటున్నాయి. బీసీసీఐ అంచనా ప్రకారం ఈ హక్కుల కోసం ఈ సారి రూ.45 వేల కోట్లకు పైగా ధర పలికే అవకాశం ఉందని తెలిసింది. ఈ హక్కుల కోసం నాలుగు దిగ్గజ సంస్థలు బిడ్డింగ్‌ తుది జాబితాలో చోటు దక్కించుకున్నాయని సమాచారం. డిస్నీ స్టార్‌, రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌18, జీ, సోనీ తుది బిడ్డింగ్‌కు సిద్ధమయ్యాయని టీ20 లీగ్‌ వర్గాలు తెలిపాయి. ‘‘నాలుగు సంస్థలు బిడ్డింగ్‌ తుది జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఆఖరి బిడ్లు దాఖలు చేశాక విజేత ఎవరో తెలుస్తుంది. తుది జాబితాలో నిలిచిన ఆ నాలుగు సంస్థలు.. వయాకామ్‌18, డిస్నీ స్టార్‌, సోనీ, జీ’’ అని ఐపీఎల్‌ వర్గాలు వెల్లడించాయి. టీవీ, డిజిటల్‌ ప్రసార హక్కులను భారత ఉప ఖండం, మిగిలిన ప్రపంచం అనే అంశాల ఆధారంగా ఈ సారి నాలుగు ప్యాకేజీలుగా విభజించి ఈ- వేలం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రేసు నుంచి ఇప్పటికే అమెజాన్‌ తప్పుకుంది. ఈ నేపథ్యంలో పోటీ ప్రధానంగా డిస్నీ స్టార్‌, వయాకామ్‌18 మధ్య ఉండే ఆస్కారముంది. వయాకామ్‌18 యాజమాన్య సంస్థ రిలయన్స్‌.. ఈ సారి మీడియా ప్రసార హక్కుల కోసం గట్టిగానే ప్రయత్నించనుందని సమాచారం. చివరకు ఆ సంస్థకే హక్కులు దక్కిన ఆశ్చర్యపోనవరం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు