Mithali Raj: నాకు సంతృప్తినిచ్చేది అదే.. మిథాలీ రాజ్‌

బాలికలు వీధుల్లో ఆడడం, అకాడమీల్లో చేరడమనేది తన వల్ల చాలా సాధారణ విషయంగా మారి ఉంటుందని క్రికెట్‌ దిగ్గజం, భారత మహిళల మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ వ్యాఖ్యానించింది. 23 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలుకుతూ ఆమె ఇటీవలే క్రికెట్‌ నుంచి రిటైరైన సంగతి తెలిసిందే. లక్షలాది అమ్మాయిలకు ఆమె ప్రేరణగా నిలిచింది. మీరు వారసత్వంగా వదిలిన గొప్ప అంశం ఏంటి అన్న ప్రశ్నకు మిథాలీ స్పందిస్తూ.. ‘‘ఈ ప్రశ్న నన్ను చాలాసార్లు అడిగారు. ఎప్పు

Updated : 16 Jun 2022 06:58 IST

దిల్లీ: బాలికలు వీధుల్లో ఆడడం, అకాడమీల్లో చేరడమనేది తన వల్ల చాలా సాధారణ విషయంగా మారి ఉంటుందని క్రికెట్‌ దిగ్గజం, భారత మహిళల మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ వ్యాఖ్యానించింది. 23 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలుకుతూ ఆమె ఇటీవలే క్రికెట్‌ నుంచి రిటైరైన సంగతి తెలిసిందే. లక్షలాది అమ్మాయిలకు ఆమె ప్రేరణగా నిలిచింది. మీరు వారసత్వంగా వదిలిన గొప్ప అంశం ఏంటి అన్న ప్రశ్నకు మిథాలీ స్పందిస్తూ.. ‘‘ఈ ప్రశ్న నన్ను చాలాసార్లు అడిగారు. ఎప్పుడూ మంచి జవాబివ్వలేకపోయా. బహుశా.. ఆడపిల్లలు వీధుల్లో క్రికెట్‌ ఆడడం, అకాడమీల్లో చేరడాన్ని నేను సాధారణ విషయంగా మార్చి ఉంటా. నేను క్రికెట్‌ ఆడడం మొదలుపెట్టినప్పుడు అది మామూలు విషయం కాదు. ‘మేం అకాడమీల్లో అమ్మాయిలను చేర్చుకోం. మరెక్కడికైనా తీసుకెళ్లండి’ అనే వాళ్లు’’ అని చెప్పింది. ‘‘ఇప్పుడైతే బాలురకు మాత్రమే అన్న అకాడమీలే లేవు. ఏ అకాడమీ కూడా బాలికలను చేర్చుకోవడానికి నిరాకరించట్లేదు. అది నాకు చాలా సంతృప్తినిస్తోంది’’ అని మిథాలీ అంది. ఇప్పుడున్న మహిళా క్రికెటర్లలో భారత్‌కు దీర్ఘకాలం ఆడేలా కనిపిస్తున్నది ఎవరని అడగగా.. ‘‘కిరణ్‌ నవ్‌గిరే ఆసక్తి కలిగిస్తోంది. దేశవాళీ టీ20, మహిళల ఛాలెంజ్‌లో ఆమె మెరుగ్గా రాణించింది. భారత జట్టులో యస్తిక భాటియా, రిచా ఘోష్‌, షెఫాలీ వర్మలకు మంచి భవిష్యత్తుంది. ఎస్‌.మేఘనకు కొన్ని అవకాశాలే వచ్చినా మెరుగైన ప్రదర్శన చేసింది’’ అని చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని