Team India: లండన్‌లో టీమ్‌ఇండియా.. కాస్త ఆలస్యంగా వెళ్లనున్న రోహిత్‌

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో వాయిదా పడిన టెస్టును ఆడేందుకు భారత జట్టు ప్రత్యర్థి గడ్డపై అడుగుపెట్టింది. గురువారం ఉదయం విమానం ఎక్కిన టెస్టు జట్టు సభ్యులు విరాట్‌ కోహ్లి, బుమ్రా, మహ్మద్‌ షమి, పుజారా, సిరాజ్‌, శుభ్‌మన్‌ గిల్‌, రవీంద్ర జడేజా,

Updated : 17 Jun 2022 06:44 IST

ముంబయి: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో వాయిదా పడిన టెస్టును ఆడేందుకు భారత జట్టు ప్రత్యర్థి గడ్డపై అడుగుపెట్టింది. గురువారం ఉదయం విమానం ఎక్కిన టెస్టు జట్టు సభ్యులు విరాట్‌ కోహ్లి, బుమ్రా, మహ్మద్‌ షమి, పుజారా, సిరాజ్‌, శుభ్‌మన్‌ గిల్‌, రవీంద్ర జడేజా, హనుమ విహారి, కేఎస్‌ భరత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ, శార్దూల్‌ ఠాకూర్‌ లండన్‌లో దిగారు. అయితే కెప్టెన్‌ రోహిత్‌శర్మ కాస్త ఆలస్యంగా ఈనెల 20న ఇంగ్లాండ్‌కు వెళ్లనున్నాడు. ప్రస్తుతం సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో టీ20 మ్యాచ్‌లు ఆడుతున్న రిషబ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కూడా ఈ సిరీస్‌ ముగిశాక ఇంగ్లాండ్‌కు బయల్దేరనున్నారు. గతేడాది కోహ్లి సారథ్యంలో ఇంగ్లాండ్‌కు వెళ్లిన భారత్‌.. అయిదు టెస్టుల సిరీస్‌లో తొలి నాలుగు మ్యాచ్‌లు ఆడాక 2-1తో ఆధిక్యంలో నిలిచింది. కొవిడ్‌ కారణంగా ఆఖరి టెస్టు వాయిదా పడింది. ఆ టెస్టు జులై 1న బర్మింగ్‌హామ్‌లో ఆరంభంకానుంది. ఈ మ్యాచ్‌కు ముందు జూన్‌ 24-27 మధ్య లీసెస్టర్‌షైర్‌తో రోహిత్‌ సేన నాలుగు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడనుంది. గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమైన కేఎల్‌ రాహుల్‌ జర్మనీ వెళ్లనున్నాడు. గజ్జల్లో గాయానికి అతడు అక్కడ చికిత్స తీసుకోనున్నాడు. మరోవైపు జూన్‌ 26, 28 తేదీల్లో హార్దిక్‌ పాండ్య సారథ్యంలోని భారత పరిమిత ఓవర్ల జట్టు ఐర్లాండ్‌తో రెండు టీ20ల్లో తలపడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు