న్యూజిలాండ్‌ 225/5

ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో న్యూజిలాండ్‌ తడబడ్డా.. డరిల్‌ మిచెల్‌ పోరాటంతో కాస్త కోలుకుంది.. తొలి రోజు, గురువారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. మిచెల్‌ (78 బ్యాటింగ్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

Published : 24 Jun 2022 01:51 IST

ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు

లీడ్స్‌: ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో న్యూజిలాండ్‌ తడబడ్డా.. డరిల్‌ మిచెల్‌ పోరాటంతో కాస్త కోలుకుంది.. తొలి రోజు, గురువారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. మిచెల్‌ (78 బ్యాటింగ్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓ దశలో 83 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన కివీస్‌ను అతడు ఆదుకున్నాడు. నికోల్స్‌ (19)తో అయిదో వికెట్‌కు 40, బ్లండెల్‌ (45 బ్యాటింగ్‌)తో అభేద్యమైన ఆరో వికెట్‌కు 102 పరుగులు జోడించాడు. స్టువర్ట్‌ బ్రాడ్‌, లీచ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

పాపం నికోల్స్‌

కివీస్‌ బ్యాట్స్‌మన్‌ నికోల్స్‌ను దురదృష్టం వెంటాడింది. అతడు విచిత్ర పరిస్థితుల్లో ఔటయ్యాడు. మిచెల్‌తో కలిసి కివీస్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్న అతడు.. టీకి ముందు చివరి బంతికి ఊహించని విధంగా వెనుదిరిగాడు. లీచ్‌ బౌలింగ్‌లో నికోల్స్‌ స్ట్రెయిట్‌ డ్రైవ్‌ ఆడగా.. బంతి కాస్తా నాన్‌ స్ట్రైకర్స్‌ ఎండ్‌లో మిచెల్‌ బ్యాటును తాకింది. వేగంగా వచ్చిన బంతి నుంచి మిచెల్‌ తప్పించుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గాల్లోకి లేచిన బంతిని మిడాఫ్‌లో అలెక్స్‌ అలవోకగా పట్టేశాడు. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. బౌలర్‌ లీచ్‌ మాత్రం కాసేపు అయోమయానికి గురయ్యాడు. బ్యాట్స్‌మన్‌ షాక్‌తో పెవిలియన్‌ చేరాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని