సెమీఫైనల్లో జ్యోతి

ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-3 టోర్నమెంట్లో జ్యోతి సురేఖ సెమీఫైనల్‌ చేరింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌ సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో జ్యోతి 149-148తో లిసెల్‌ జాట్మా (ఇస్తోనియా)పై విజయం సాధించింది. ఈ పోరులో ఆఖరికి జ్యోతి-లిసెల్‌ సమానంగా నిలిచారు.

Published : 24 Jun 2022 01:51 IST

ఫైనల్లో రికర్వ్‌ జట్టు

పారిస్‌: ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-3 టోర్నమెంట్లో జ్యోతి సురేఖ సెమీఫైనల్‌ చేరింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌ సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో జ్యోతి 149-148తో లిసెల్‌ జాట్మా (ఇస్తోనియా)పై విజయం సాధించింది. ఈ పోరులో ఆఖరికి జ్యోతి-లిసెల్‌ సమానంగా నిలిచారు. కానీ నిర్ణయాత్మక షాట్‌లో 10 పాయింట్లు సాధించిన జ్యోతి.. ప్రత్యర్థిని ఒక్క పాయింట్‌ తేడాతో వెనక్కినెట్టి ముందంజ వేసింది. సెమీస్‌లో సోఫి (ఫ్రాన్స్‌)తో జ్యోతి తలపడనుంది. పురుషుల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో అభిషేక్‌ వర్మ 147-148తో జీన్‌ పిజారో (ఫ్యూర్టోరికో) చేతిలో ఓడాడు. మరోవైపు మహిళల రికర్వ్‌ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వాలిఫయింగ్‌లో 13వ ర్యాంకులో నిలిచిన దీపిక కుమారి, అంకిత బాకత్‌, సిమ్రన్‌జీత్‌ కౌర్‌లతో కూడిన మన జట్టు సెమీస్‌లో 56-51, 57-56, 54-55, 55-55తో టర్కీ (గల్నాజ్‌, బాసరన్‌, యాస్మిన్‌)పై విజయం సాధించింది. ఈ పోరులో తొలి రెండు సెట్లు గెలిచిన భారత్‌.. మూడో సెట్లో పోరాడి ఓడింది. ఫైనల్లో అడుగుపెట్టాలంటే నాలుగో సెట్లో కనీసం టై అవసరం కాగా.. ప్రత్యర్థి జట్టుతో సమానంగా 55 పాయింట్లు సాధించి ముందంజ వేసింది. అంతకుముందు క్వార్టర్స్‌లో భారత్‌ 6-0తో బ్రిటన్‌ను చిత్తు చేసింది. ఆదివారం జరిగే తుది పోరులో చైనీస్‌ తైపీతో మన జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. పురుషుల టీమ్‌ విభాగంలో తరుణ్‌దీప్‌ రాయ్‌, జయంత తాలుక్‌దార్‌, ప్రవీణ్‌ జాదవ్‌లతో కూడిన భారత జట్టు ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. షూటాఫ్‌లో 4-5తో స్విట్జర్లాండ్‌ చేతిలో ఓడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని