ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడడం వల్లే..

రంజీ, కౌంటీ ఛాంపియన్‌షిప్స్‌లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడడం వల్లే తిరిగి ఫామ్‌ అందుకుని టీమ్‌ఇండియాలోకి పునరాగమనం చేయగలిగానని సీనియర్‌ బ్యాటర్‌ చెతేశ్వర్‌ పుజారా అన్నాడు.

Published : 24 Jun 2022 01:51 IST

లెస్టర్‌: రంజీ, కౌంటీ ఛాంపియన్‌షిప్స్‌లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడడం వల్లే తిరిగి ఫామ్‌ అందుకుని టీమ్‌ఇండియాలోకి పునరాగమనం చేయగలిగానని సీనియర్‌ బ్యాటర్‌ చెతేశ్వర్‌ పుజారా అన్నాడు. పేలవ ఫామ్‌ కారణంగా శ్రీలంకతో స్వదేశంలో జరిగిన సిరీస్‌కు పుజారా జట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే కౌంటీ క్రికెట్లో ససెక్స్‌ తరఫున కేవలం 5 మ్యాచ్‌ల్లో 720 పరుగులు చేయడం అతడు తిరిగి సెలక్టర్లను మెప్పించాడు. రంజీ ట్రోఫీలో ముంబయిపై 83 బంతుల్లో 91 పరుగులు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని