నిర్ణయించుకునే హక్కు వాళ్లకే

జర్మనీ ఫుట్‌బాల్‌ సమాఖ్య విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. తమ దేశ ఫుట్‌బాల్‌ రంగంలో సంచలన మార్పుకు శ్రీకారం చుట్టింది. లింగమార్పిడి చేసుకున్న మహిళలు.. అమ్మాయిల విభాగంలో పోటీపడకూడదంటూ ఇటీవల ప్రపంచ స్విమ్మింగ్‌, అంతర్జాతీయ రగ్బీ లీగ్‌ నిషేధం విధించాయి.

Published : 24 Jun 2022 01:51 IST

జర్మనీ ఫుట్‌బాల్‌ సమాఖ్య సంచలన నిర్ణయం

బెర్లిన్‌: జర్మనీ ఫుట్‌బాల్‌ సమాఖ్య విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. తమ దేశ ఫుట్‌బాల్‌ రంగంలో సంచలన మార్పుకు శ్రీకారం చుట్టింది. లింగమార్పిడి చేసుకున్న మహిళలు.. అమ్మాయిల విభాగంలో పోటీపడకూడదంటూ ఇటీవల ప్రపంచ స్విమ్మింగ్‌, అంతర్జాతీయ రగ్బీ లీగ్‌ నిషేధం విధించాయి. ఈ నేపథ్యంలో జర్మనీ ఫుట్‌బాల్‌ సమాఖ్య ఏ జట్టులో ఆడాలన్నది క్రీడాకారులకే వదిలేసింది. అమ్మాయిలు లేదా పురుషుల జట్లలో ఇలా తమ ఇష్టం మేరకు ఎవరితో కలిసి ఆడాలనే నిర్ణయం తీసుకునే అవకాశం వాళ్లకు కల్పించింది. తమ లింగత్వం గురించి చెప్పుకోలేని ప్లేయర్లకు ‘విభిన్న’ లేదా ‘పేర్కొనని’ అనే పేరుతో ఆ సమాఖ్య ప్రత్యేక హోదా అందుబాటులోకి తెచ్చింది. ‘‘ఇప్పటికే వివిధ జట్లలో కొనసాగుతున్న ట్రాన్స్‌జెండర్లకూ ఈ నిబంధన వర్తిస్తుంది. వైద్య చికిత్స కోసం ఔషధాలు వాడుతున్న ఇలాంటి ప్లేయర్ల ఆరోగ్యంపై ఆట ప్రభావం చూపనంత వరకూ ఎలాంటి ఇబ్బంది లేదు’’ అని జపాన్‌ ఫుట్‌బాల్‌ వ్యవహారాలను పర్యవేక్షించే డీఎఫ్‌బీ ఓ ప్రకటనలో తెలిపింది. వచ్చే సీజన్‌ నుంచి ఈ కొత్త నిబంధనలు దేశంలో అన్ని రకాల ఫుట్‌బాల్‌ జట్లకు వర్తిస్తాయి. జర్మన్‌ సాకర్‌ సమాఖ్య ప్రపంచంలోనే అతిపెద్దది. వివిధ స్థాయిల్లో కలిపి 24 వేలకు పైగా క్లబ్బులు, లక్షా 30 వేలకు పైగా జట్లు, 22 లక్షలకు పైగా ఆటగాళ్లు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని