2028 ఒలింపిక్స్‌కు కాంపౌండ్‌ ఆర్చరీ సిఫార్సు

2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌ ఆర్చరీలో ఇండోర్‌ కాంపౌండ్‌ ఈవెంట్లను చేర్చాలంటూ సిఫార్సు చేసినట్లు ప్రపంచ ఆర్చరీ (డబ్ల్యూఏ) ప్రకటించింది. ప్రస్తుతం ఒలింపిక్స్‌లో ఆర్చరీలో రికర్వ్‌ ఈవెంట్లు మాత్రమే ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉన్న కాంపౌండ్‌ ఈవెంట్‌ ఒలింపిక్స్‌లో లేదు.

Published : 25 Jun 2022 02:15 IST

దిల్లీ: 2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌ ఆర్చరీలో ఇండోర్‌ కాంపౌండ్‌ ఈవెంట్లను చేర్చాలంటూ సిఫార్సు చేసినట్లు ప్రపంచ ఆర్చరీ (డబ్ల్యూఏ) ప్రకటించింది. ప్రస్తుతం ఒలింపిక్స్‌లో ఆర్చరీలో రికర్వ్‌ ఈవెంట్లు మాత్రమే ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉన్న కాంపౌండ్‌ ఈవెంట్‌ ఒలింపిక్స్‌లో లేదు. ఆసియా క్రీడలు, ఐరోపా క్రీడలు, పాన్‌ అమెరికన్‌ క్రీడలు, ప్రపంచ క్రీడలు, ప్రపంచ యూనివర్సిటీ క్రీడల్లో కాంపౌండ్‌ ఈవెంట్‌ ఉంది. డబ్ల్యూఏ తాజా సిఫార్సు, ఇతర క్రీడల నుంచి వచ్చిన ప్రతిపాదనలను అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది. ‘‘మన కాంపౌండ్‌ ఆర్చర్లు బాగా రాణిస్తున్నారు. రానున్న ఆరేళ్లలో రిషబ్‌ యాదవ్‌, ప్రథమేశ్‌, జావల్కర్‌, కుందేరా, ప్రియా గుర్జర్‌, పరణీత్‌ కౌర్‌, అదితి, ప్రగతి, సాక్షిలతో కూడిన జూనియర్‌ బృందం ఒలింపిక్‌ పతకం గెలిచేందుకు సిద్ధంగా ఉంటుంది. ఒలింపిక్స్‌లో కాంపౌండ్‌ ఈవెంట్‌ చేరిస్తే భారత ఆర్చరీ పూర్తిగా మారిపోతుంది’’ అని భారత ఆర్చరీ హై పర్ఫార్మెన్స్‌ డైరెక్టర్‌ సంజీవ సింగ్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని