- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
భారత్‌కు కఠిన డ్రా
అండర్-17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్
దిల్లీ: స్వదేశంలో జరగనున్న ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్‌లో భారత్‌కు కఠినమైన డ్రా ఎదురైంది. ప్రపంచ ఫుట్‌బాల్‌లో శక్తిమంతమైన బ్రెజిల్, మొరాకోతో పాటు అమెరికాతో కలిసి భారత్ గ్రూప్- ఎ లో ఉంది. అక్టోబర్ 11 నుంచి 30 వరకు జరిగే ఈ టోర్నీ డ్రాను శుక్రవారం విడుదల చేశారు. మొత్తం పోటీపడే 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఈ ప్రపంచకప్ మ్యాచ్‌లు భువనేశ్వర్, గోవా, నవీ ముంబయిలో జరుగుతాయి. పోటీల తొలి రోజు అమెరికాతో భారత్ తలపడుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 14న తన రెండో మ్యాచ్‌లో మొరాకోను, 17న మూడో మ్యాచ్‌లో బ్రెజిల్‌ను ఢీ కొడుతుంది. గ్రూప్- బి లో జర్మనీ, నైజీరియా, న్యూజిలాండ్, చిలీ.. గ్రూప్- సి లో డిఫెండింగ్ ఛాంపియన్ స్పెయిన్, కొలంబియా, చైనా, మెక్సికో.. గ్రూప్- డి లో జపాన్, టాంజానియా, కెనడా, ఫ్రాన్స్ ఉన్నాయి. ఈ టోర్నీ చరిత్రలో ఉత్తర కొరియా అత్యధికంగా రెండు సార్లు (2008, 2016) టైటిల్ గెలిచింది. జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్ ఒక్కోసారి కప్పు ముద్దాడాయి. షెడ్యూల్ ప్రకారం 2020లోనే ఈ ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమివ్వాల్సింది. కానీ కరోనా కారణంగా అప్పుడది రద్దయింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Ukraine: రహస్యంగా ‘ఆపరేషన్ క్రిమియా’
-
General News
Gorantla Madhav: ప్రైవేటు ఫొరెన్సిక్ ల్యాబ్ ఎలా ప్రామాణికం?: ఏపీ సీఐడీ చీఫ్ సునీల్
-
General News
BJP: జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలి: కె.లక్ష్మణ్
-
Politics News
Congress: సోనియా అపాయింట్మెంట్ కోరిన కోమటిరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి
-
Movies News
Thiru review: రివ్యూ: తిరు
-
Politics News
Vijayashanthi: భాజపా రాష్ట్ర నాయకత్వంపై విజయశాంతి అసంతృప్తి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vinod kambli: బీసీసీఐ పింఛనే నాకు దిక్కు.. సచిన్ నుంచి ఏమీ ఆశించట్లేదు: వినోద్ కాంబ్లి
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
- Vizag: విశాఖలో రౌడీషీటర్ హత్య.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘాతుకం
- Andhra News: వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (18/08/2022)
- Madhavan: ‘రాకెట్రీ.. మాధవన్ ఇంటిని కోల్పోయాడు’
- Viral video: యూనిఫాంలో పోలీసుల ‘నాగిని డ్యాన్స్’.. వైరల్‌గా మారిన వీడియో
- Kabul: కాబుల్ మసీదులో భారీ పేలుడు.. భారీగా ప్రాణనష్టం?