బెయిర్‌స్టో అజేయ శతకం

న్యూజిలాండ్‌పై ఇప్పటికే 2-0తో సిరీస్‌ సాధించిన ఇంగ్లాండ్‌.. నామమాత్రమైన మూడో టెస్టులోనూ ప్రత్యర్థికి దీటుగా బదులిస్తోంది.తొలి ఇన్నింగ్స్‌లో బౌల్ట్‌ (3/73), వాగ్నర్‌ (2/53)ల ధాటికి ఒక దశలో 55 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆతిథ్య జట్టు.. బెయిర్‌స్టో (130 నాటౌట్‌; 126 బంతుల్లో 214), జేమీ ఒవర్ట

Updated : 25 Jun 2022 02:37 IST

ఇంగ్లాండ్‌ 55/6 నుంచి 264/6

కివీస్‌ 329 ఆలౌట్‌

లీడ్స్‌: న్యూజిలాండ్‌పై ఇప్పటికే 2-0తో సిరీస్‌ సాధించిన ఇంగ్లాండ్‌.. నామమాత్రమైన మూడో టెస్టులోనూ ప్రత్యర్థికి దీటుగా బదులిస్తోంది.తొలి ఇన్నింగ్స్‌లో బౌల్ట్‌ (3/73), వాగ్నర్‌ (2/53)ల ధాటికి ఒక దశలో 55 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆతిథ్య జట్టు.. బెయిర్‌స్టో (130 నాటౌట్‌; 126 బంతుల్లో 214), జేమీ ఒవర్టన్‌ (89 బ్యాటింగ్‌; 106 బంతుల్లో 124, 26)ల అద్భుత పోరాటంతో గొప్పగా పుంజుకుంది. ఆట ఆఖరుకు 264/6తో నిలిచింది. బెయిర్‌స్టో, ఒవర్టన్‌ అభేద్యమైన ఏడో వికెట్‌కు 209 పరుగులు జోడించారు. అంతకుముందు 225/6తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కివీస్‌.. 329 పరుగులకు ఆలౌటైంది. 78 పరుగులతో బ్యాటింగ్‌ కొనసాగించిన మిచెల్‌ (109; 228 బంతుల్లో 94, 36) సెంచరీ పూర్తి చేశాడు. లోయరార్డర్లో సౌథీ (33) రాణించాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో లీచ్‌ (5/100), బ్రాడ్‌ (3/62) సత్తా చాటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని