జెహాన్‌ ఎఫ్‌1 దిశగా...

ఫార్ములా వన్‌ రేసర్‌గా మారాలనే లక్ష్యం దిశగా భారత యువ సంచలనం జెహాన్‌ దారువాలా మరో అడుగు ముందుకేశాడు. మెక్‌లారెన్‌ జట్టు తరపున తన అరంగేట్ర ఎఫ్‌1 కారు రేసు పరీక్షను విజయవంతంగా పూర్తి చేశాడు. రెండు రోజుల రేసులో 130 ల్యాప్స్‌ పూర్తి చేసి.. ఎఫ్‌1 రేసులో పోటీపడేందుకు అవసరమైన

Published : 25 Jun 2022 02:15 IST

ముంబయి: ఫార్ములా వన్‌ రేసర్‌గా మారాలనే లక్ష్యం దిశగా భారత యువ సంచలనం జెహాన్‌ దారువాలా మరో అడుగు ముందుకేశాడు. మెక్‌లారెన్‌ జట్టు తరపున తన అరంగేట్ర ఎఫ్‌1 కారు రేసు పరీక్షను విజయవంతంగా పూర్తి చేశాడు. రెండు రోజుల రేసులో 130 ల్యాప్స్‌ పూర్తి చేసి.. ఎఫ్‌1 రేసులో పోటీపడేందుకు అవసరమైన సూపర్‌ లైసెన్స్‌ దక్కించుకునేందుకు సరిపడా పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. 23 ఏళ్ల జెహాన్‌ ట్రాక్‌పై ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎఫ్‌1 కారును పరుగెత్తించాడు. ప్రస్తుతం ఇటలీ జట్టు ప్రేమ తరపున ఎఫ్‌2లో జెహాన్‌ పోటీపడుతున్నాడు. ప్రస్తుతం ఛాంపియన్‌షిప్‌ పట్టికలో అతను మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని