Published : 25 Jun 2022 02:15 IST

శ్రీనుకు అవకాశం దక్కేనా?

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ మారథాన్‌ రన్నర్‌ బుగత శ్రీనుకు కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనే అవకాశం దక్కేనా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తనను కామన్వెల్త్‌ క్రీడలకు ఎంపిక చేయాలంటూ కోర్టుకెక్కిన హైజంప్‌ అథ్లెట్‌ తేజస్విన్‌ శంకర్‌ కారణంగా శ్రీనుతో పాటు మరో ముగ్గురు అథ్లెట్లకు బర్మింగ్‌హామ్‌ వెళ్లే ఛాన్స్‌ దొరుకుతుందనే ఆశలు రేగుతున్నాయి. కానీ క్రీడల్లో పాల్గొనే అథ్లెట్ల కోటా పెంచేలా భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) తీసుకునే నిర్ణయంపై వీళ్ల భవితవ్యం ఆధారపడి ఉంది. వచ్చే నెల 28న ఆరంభమయ్యే కామన్వెల్త్‌ క్రీడల కోసం ఇటీవల 36 మంది అథ్లెట్లతో కూడిన బృందాన్ని భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) ప్రకటించింది. అర్హత ప్రమాణాన్ని అందుకున్నప్పటికీ అంతర్‌ రాష్ట్ర అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌కు శంకర్‌ దూరంగా ఉండడంతో అతణ్ని ఎంపిక చేయలేదు. దీంతో అతను దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. శంకర్‌తో పాటు మారథాన్‌ రన్నర్లు శ్రీను, అనీశ్‌ తాపా, హెప్టాథ్లెట్‌ స్వప్న బర్మాన్‌, రిలే రన్నర్‌ జిల్నా ఎంవీని కూడా అథ్లెట్ల బృందంలో చేర్చాలని నిర్ణయించింది. కానీ ఏఎఫ్‌ఐకి ఐఓఏ 36 కోటా స్థానాలు మాత్రమే కేటాయించింది. ఈ నేపథ్యంలో తాజాగా కోటా స్థానాలు పెంచమని ఐఓఏని ఏఎఫ్‌ఐ కోరింది. మరి దీనిపై ఐఓఏ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని