IND vs LEIC : రాణించిన కోహ్లి, శ్రేయస్‌

లెస్టర్‌: ప్రాక్టీస్‌ మ్యాచ్‌ మూడో రోజును భారత బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో దాదాపు ప్రతి బ్యాట్స్‌మనూ విలువైన సమయం క్రీజులో గడిపాడు. ముఖ్యంగా కోహ్లి (67; 98 బంతుల్లో 5X4, 2X6), శ్రేయస్‌ అయ్యర్‌ (62; 89 బంతుల్లో 11X4), జడేజా (56 బ్యాటింగ్‌; 77 బంతుల్లో 11X4) అర్ధశతకాలతో ఆకట్టుకున్నా

Updated : 26 Jun 2022 03:09 IST

భారత్‌ 364/7

ప్రాక్టీస్‌ మ్యాచ్‌

లెస్టర్‌: ప్రాక్టీస్‌ మ్యాచ్‌ మూడో రోజును భారత బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో దాదాపు ప్రతి బ్యాట్స్‌మనూ విలువైన సమయం క్రీజులో గడిపాడు. ముఖ్యంగా కోహ్లి (67; 98 బంతుల్లో 5X4, 2X6), శ్రేయస్‌ అయ్యర్‌ (62; 89 బంతుల్లో 11X4), జడేజా (56 బ్యాటింగ్‌; 77 బంతుల్లో 11X4) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఓవర్‌నైట్‌ స్కోరు 80/1తో శనివారం ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌.. ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 364 పరుగులు సాధించింది. జడేజాతో పాటు సిరాజ్‌ (1) క్రీజులో ఉన్నారు. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ శ్రీకర్‌ భరత్‌ (43), హనుమ విహారి (20) త్వరగానే నిష్క్రమించినా మిగతా బ్యాట్స్‌మెన్‌ స్కోరు బోర్డును నడిపించారు. కోహ్లి, శ్రేయస్‌, జడేజా ధాటిగా బ్యాటింగ్‌ చేశారు. శార్దూల్‌ 28 (38 బంతుల్లో), పుజారా 22 (53 బంతుల్లో) పరుగులు చేశారు. సైనీ మూడు వికెట్లు పడగొట్టగా.. నాగర్‌కోటి రెండు వికెట్లు చేజిక్కించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 246/8 వద్ద డిక్లేర్‌ చేయగా.. లెస్టర్‌ 244 పరుగులకు ఆలౌటైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు