Hima Das: కరోనాతో చచ్చిపోతా అనుకున్నా: హిమదాస్‌

: కరోనాతో ఒక రోజు చచ్చిపోతానేమో అనిపించిందని.. భయంతో తలుపులు తీసి నిద్రపోయానని చెప్పింది భారత స్టార్‌ అథ్లెట్‌ హిమదాస్‌. జాతీయ అథ్లెటిక్స్‌లో 100 మీటర్ల పరుగులో స్వర్ణంతో పునరాగమనాన్ని ఘనంగా చాటిన ఈ స్ప్రింటర్‌.. కరోనా సమయంలో తాను పడిన వేదన గురించి వివరించింది. ‘‘గ

Updated : 26 Jun 2022 09:33 IST

దిల్లీ: కరోనాతో ఒక రోజు చచ్చిపోతానేమో అనిపించిందని.. భయంతో తలుపులు తీసి నిద్రపోయానని చెప్పింది భారత స్టార్‌ అథ్లెట్‌ హిమదాస్‌. జాతీయ అథ్లెటిక్స్‌లో 100 మీటర్ల పరుగులో స్వర్ణంతో పునరాగమనాన్ని ఘనంగా చాటిన ఈ స్ప్రింటర్‌.. కరోనా సమయంలో తాను పడిన వేదన గురించి వివరించింది. ‘‘గతేడాది జాతీయ శిక్షణ శిబిరంలో చేరిన తర్వాత కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మహమ్మారి ప్రభావం ఎంతగా ఉండేది అంటే ఒక్కోసారి చచ్చిపోతానమో అని భావించేదాన్ని. కరోనా వచ్చిన నాలుగైదు రోజులకు అనుకుంటా అర్ధరాత్రి ఉన్నట్టుండి ఉలిక్కి పడుతూ మేల్కొన్నా. గాలి ఆడనట్లే అనిపించింది. వెంటనే తలుపులు, కిటికీలు తెరిచాను. ఒకవేళ నేను అపస్మారక స్థితికి వెళితే త్వరగా నా పరిస్థితి వేరే వాళ్లకు అర్థం అవుతుందని అలా చేశాను. కరోనా సమయంలో చాలా బరువు కోల్పోయాను. శరీరంలో పట్టే లేనట్లు అనిపించింది. తిరిగి సాధన ప్రారంభించిన తర్వాత మునుపటిలా పరుగెత్తలేకపోయా. శ్వాసకు సంబంధించిన సమస్యలు వచ్చాయి. కరోనాకు ముందు గాయాల కారణంగా కుంగిపోయా. వెన్ను గాయం కారణంగా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాన్ని కొద్దిలో చేజార్చుకున్నా. చీలమండ గాయం ఉన్నా కూడా ఒలింపిక్స్‌ ట్రయల్స్‌లో పాల్గొన్నా. కానీ ఆ తప్పు వల్ల నా గాయం మరింత ఎక్కువైంది. కానీ ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోవడం తీవ్రంగా నిరాశపరిచింది. ‘జీవితంలో ఎత్తు పల్లాలు మూమూలే. కానీ పోరాటాన్ని ఆపకూడదు’ అన్న సచిన్‌ సార్‌ మాటలు స్ఫూర్తినిచ్చాయి’’ అని హిమ చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని