ప్రపంచ స్థాయి శిక్షకుల కోసం..

వివిధ స్థాయిల క్రికెటర్లకు శిక్షణ ఇచ్చే విధానంలో ఏకరూపత తెచ్చేందుకు ఆస్ట్రేలియన్‌ స్ట్రెంగ్త్‌ అండ్‌ కండిషనింగ్‌ అసోసియేషన్‌ (ఏఎస్‌సీఏ)తో బీసీసీఐ చేతులు కలిపింది. దేశంలో ప్రపంచ స్థాయి ట్రెయినర్లను తయారు చేయడమే లక్ష్యం. ఈ కొత్త విధానం వల్ల బీసీసీఐలో అన్ని స్థాయిల ఫిట్‌నెస్‌ ట్రెయినర్ల విజ్ఞానం పెరుగుతుంది

Published : 26 Jun 2022 01:52 IST

బెంగళూరు: వివిధ స్థాయిల క్రికెటర్లకు శిక్షణ ఇచ్చే విధానంలో ఏకరూపత తెచ్చేందుకు ఆస్ట్రేలియన్‌ స్ట్రెంగ్త్‌ అండ్‌ కండిషనింగ్‌ అసోసియేషన్‌ (ఏఎస్‌సీఏ)తో బీసీసీఐ చేతులు కలిపింది. దేశంలో ప్రపంచ స్థాయి ట్రెయినర్లను తయారు చేయడమే లక్ష్యం. ఈ కొత్త విధానం వల్ల బీసీసీఐలో అన్ని స్థాయిల ఫిట్‌నెస్‌ ట్రెయినర్ల విజ్ఞానం పెరుగుతుంది. అండర్‌-19 (పురుషులు, మహిళలు) నుంచి సీనియర్‌ స్థాయి వరకు ఒకే రకమైన శిక్షణ ఉంటుంది. ‘‘భారత్‌ అండర్‌-19, భారత్‌-ఏ లేదా సీనియర్‌ జట్లతో పోలిస్తే రాష్ట్ర స్థాయిలో స్ట్రెంగ్త్‌ అండ్‌ కండిషనింగ్‌ పూర్తి భిన్నంగా ఉండడం మనం తరచూ చూస్తుంటాం. ఈ కొత్త కార్యక్రమం అవసరమైనంత మంది స్ట్రెంగ్త్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌లను తయారు చేస్తుంది. వాళ్లు రాష్ట్ర స్థాయిలో ఇదే తరహా శిక్షణ ఇవ్వొచ్చు’’ అని ఓ భారత్‌-ఎ మాజీ ట్రెయినర్‌ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని