దీపిక బృందానికి రజతం

ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-3 టోర్నీలో దీపిక కుమారి, అంకిత భకత్‌, సిమ్రన్‌జీత్‌ కౌర్‌లతో కూడిన భారత రికర్వ్‌ జట్టు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆదివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో భారత్‌ 1-5తో చైనీస్‌ తైపీ చేతిలో పరాజయం చవచిచూసింది. ఒక స్వర్ణం, 2 రజతాలు గెలిచిన భారత్‌ మొత్తం 3 పతకాలతో టోర్నీని ముగించింది.

Published : 27 Jun 2022 02:35 IST

పారిస్‌: ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-3 టోర్నీలో దీపిక కుమారి, అంకిత భకత్‌, సిమ్రన్‌జీత్‌ కౌర్‌లతో కూడిన భారత రికర్వ్‌ జట్టు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆదివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో భారత్‌ 1-5తో చైనీస్‌ తైపీ చేతిలో పరాజయం చవచిచూసింది. ఒక స్వర్ణం, 2 రజతాలు గెలిచిన భారత్‌ మొత్తం 3 పతకాలతో టోర్నీని ముగించింది. అందులో కాంపౌండ్‌ విభాగం నుంచే 2 పతకాలు ఉండటం.. ఆ రెండింట్లోనూ తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కీలకపాత్ర పోషించడం విశేషం. అభిషేక్‌వర్మతో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో స్వర్ణం సాధించిన సురేఖ.. వ్యక్తిగత విభాగంలో రజతంతో మెరిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని