భారత్‌, లెస్టర్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ డ్రా

లెస్టర్‌తో టీమ్‌ ఇండియా నాలుగు రోజులు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. నాలుగో రోజు, ఆదివారం ఆట ముగిసే సమయానికి లెస్టర్‌ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఆ జట్టుకు ఆడిన ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (62; 77 బంతుల్లో 84, 26)కు మంచి ప్రాక్టీస్‌ లభించింది.

Published : 27 Jun 2022 02:35 IST

లెస్టర్‌: లెస్టర్‌తో టీమ్‌ ఇండియా నాలుగు రోజులు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. నాలుగో రోజు, ఆదివారం ఆట ముగిసే సమయానికి లెస్టర్‌ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఆ జట్టుకు ఆడిన ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (62; 77 బంతుల్లో 84, 26)కు మంచి ప్రాక్టీస్‌ లభించింది. ఇన్నింగ్స్‌లో అతడే టాప్‌ స్కోరర్‌. లూయిస్‌ కింబర్‌ (58) అర్ధసెంచరీ సాధించాడు. మూడో రోజు ఆట ఆఖరుకు రెండో ఇన్నింగ్స్‌లో 364/7తో నిలిచిన భారత్‌.. అదే స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. ఆఖరి రోజు హసన్‌ అజాద్‌ (12)తో కలిసి లెస్టర్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించిన గిల్‌ చక్కగా బ్యాటింగ్‌ చేశాడు. ఎవాన్స్‌ (26)తో రెండో వికెట్‌కు 67 పరుగులు జోడించి ఔటయ్యాడు. కింబర్‌.. హనుమ విహారి (26)తో నాలుగో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. శార్దూల్‌ ఠాకూర్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. అశ్విన్‌ రెండు వికెట్లు చేజిక్కించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ ఇండియా 246 పరుగులు చేయగా.. లెస్టర్‌ 244 పరుగులు సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని