రోహిత్‌కు కరోనా

టీమ్‌ ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం అతడు ఐసోలేషన్‌లో ఉన్నాడని బీసీసీఐ తెలిపింది. ‘‘శనివారం నిర్వహించిన ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలో భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కోవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చింది. అతడు ప్రస్తుతం హోటల్లో ఐసోలేషన్‌లో ఉన్నాడు’’ అని చెప్పింది.

Published : 27 Jun 2022 02:35 IST

బర్మింగ్‌హామ్‌: టీమ్‌ ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం అతడు ఐసోలేషన్‌లో ఉన్నాడని బీసీసీఐ తెలిపింది. ‘‘శనివారం నిర్వహించిన ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలో భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కోవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చింది. అతడు ప్రస్తుతం హోటల్లో ఐసోలేషన్‌లో ఉన్నాడు’’ అని చెప్పింది. లెస్టర్‌తో జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రోహిత్‌ తొలి రోజు బ్యాటింగ్‌ చేశాడు. అయితే రెండో రోజు అతడు బరిలోకి దిగలేదు. ఇంగ్లాండ్‌తో అయిదో టెస్టు జులై 1న ఆరంభం కానుంది. 35 ఏళ్ల రోహిత్‌.. ఆ మ్యాచ్‌లో గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించాల్సివుంది. కానీ మ్యాచ్‌ సమయానికి అతడు కోలుకుంటాడో లేదో చూడాలి. ఒకవేళ అతడు కోలుకోకపోతే బుమ్రా లేదా పంత్‌ జట్టుకు నాయకత్వం వహించే అవకాశముంది.

మూడో టెస్టు నుంచి ఫోక్స్‌ ఔట్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు నుంచి ఇంగ్లాండ్‌ వికెట్‌కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ వైదొలిగాడు. అతడికి కరోనా పాజిటివ్‌ రావడమే అందుకు కారణం. ఫోక్స్‌ వెన్నునొప్పి కారణంగా మూడో రోజు మధ్యాహ్నం మైదానంలోకి రాలేదు. ఆ తర్వాత చేసిన పరీక్షల్లో అతడికి కరోనా సోకినట్లు తేలింది. ఫోక్స్‌ స్థానంలో బిల్లింగ్స్‌ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి వచ్చాడు. అతనే వికెట్‌ కీపింగ్‌ చేస్తున్నాడు. ఫోక్స్‌ భారత్‌తో టెస్టు మ్యాచ్‌కు కూడా అనుమానంగా మారాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని