టైటిల్‌పై సింధు, ప్రణయ్‌ గురి

భారత అగ్రశ్రేణి షట్లర్లు పి.వి.సింధు, హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌లు మలేసియా ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నీపై దృష్టిసారించారు. మంగళవారం ప్రారంభంకానున్న ఈ టోర్నీలో టైటిలే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. ఇటీవల ఇండోనేసియా ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఓడిన సింధు.. మలేసియాలో సత్తాచాటాలని పట్టుదలగా ఉంది.

Published : 28 Jun 2022 01:29 IST

మలేసియా ఓపెన్‌ నేటినుంచే

కౌలాలంపూర్‌

భారత అగ్రశ్రేణి షట్లర్లు పి.వి.సింధు, హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌లు మలేసియా ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నీపై దృష్టిసారించారు. మంగళవారం ప్రారంభంకానున్న ఈ టోర్నీలో టైటిలే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. ఇటీవల ఇండోనేసియా ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఓడిన సింధు.. మలేసియాలో సత్తాచాటాలని పట్టుదలగా ఉంది. మహిళల సింగిల్స్‌లో పోర్న్‌పావీ చోచువాంగ్‌ (థాయ్‌లాండ్‌)తో ఏడో సీడ్‌ సింధు తన పోరాటాన్ని ప్రారంభించనుంది. ఇప్పటి వరకు వీరిద్దరు 8 సార్లు తలపడగా.. ఐదింట్లో సింధు, మూడింట్లో పోర్న్‌పావీ పైచేయి సాధించారు. మరో స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ తొలి రౌండ్లో ఐరిస్‌ వాంగ్‌ (అమెరికా)తో తలపడనుంది. ఈ అడ్డంకిని అధిగమిస్తే ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్‌ నొజొమి ఒకుహర (జపాన్‌)తో సైనా తలపడొచ్ఛు పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో డారెన్‌ ల్యూ (మలేసియా)తో ప్రణయ్‌, జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)తో సమీర్‌వర్మ, ఆంథోనీ జింటింగ్‌ (ఇండోనేసియా)తో సాయి ప్రణీత్‌, క్వాంగ్‌ హీ (కొరియా)తో పారుపల్లి కశ్యప్‌ పోటీపడతారు. పురుషుల డబుల్స్‌లో వీ చాంగ్‌- వున్‌ తీ (మలేసియా)తో సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌శెట్టి; మహిళల డబుల్స్‌లో మత్సుయామా- చిహరు (జపాన్‌)తో సిక్కిరెడ్డి- అశ్విని పొన్నప్ప; మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రాబిన్‌- సెలెనా (నెదర్లాండ్స్‌)తో సుమీత్‌రెడ్డి- అశ్విని పొన్పప్ప, కిమ్‌ వాన్‌- జియాంగ్‌ యున్‌ (కొరియా)తో వెంకట గౌరవ్‌ ప్రసాద్‌- జుహి తమ పోరాటాన్ని ప్రారంభిస్తారు. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో వాకోవర్‌ లభించడంతో శ్రీవేద్య గురజాడ (భారత్‌)- ఇషిక జైశ్వాల్‌ (అమెరికా) జోడీ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని