టీమ్‌ఇండియాతో చేరనున్న మయాంక్‌

ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌కు టీమ్‌ఇండియాతో చేరాలంటూ పిలుపొచ్చింది. కెప్టెన్‌ రోహిత్‌శర్మ కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సెలెక్షన్‌ కమిటీ మయాంక్‌ను జట్టుకు ఎంపిక చేసింది. దీంతో జులై 1న ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే అయిదో టెస్టు (ఏకైక మ్యాచ్‌)కు మయాంక్‌ అందుబాటులో ఉండనున్నాడు. తొ

Published : 28 Jun 2022 01:29 IST

దిల్లీ: ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌కు టీమ్‌ఇండియాతో చేరాలంటూ పిలుపొచ్చింది. కెప్టెన్‌ రోహిత్‌శర్మ కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సెలెక్షన్‌ కమిటీ మయాంక్‌ను జట్టుకు ఎంపిక చేసింది. దీంతో జులై 1న ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే అయిదో టెస్టు (ఏకైక మ్యాచ్‌)కు మయాంక్‌ అందుబాటులో ఉండనున్నాడు. తొలుత ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు 15 మంది సభ్యుల జట్టులో 31 ఏళ్ల మయాంక్‌కు చోటు దక్కలేదు. కేఎల్‌ రాహుల్‌ గాయపడటంతో స్టాండ్‌బైగా ఎంపికైన మయాంక్‌కు ఇంగ్లాండ్‌ వెళ్లే అవకాశమూ రాలేదు. తాజాగా రోహిత్‌ పాజిటివ్‌గా తేలడంతో మయాంక్‌కు సెలెక్టర్ల నుంచి పిలుపొచ్చింది. ‘‘రోహిత్‌కు పాజిటివ్‌ రావడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అఖిల భారత సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ ఇంగ్లాండ్‌తో అయిదో టెస్టు కోసం మయాంక్‌ను టీమ్‌ఇండియాకు ఎంపిక చేసింది. ఇప్పటికే ఇంగ్లాండ్‌కు బయల్దేరిన అతను బర్మింగ్‌హామ్‌లో జట్టుతో కలుస్తాడు’’ అని బీసీసీఐ పేర్కొంది. ‘‘ఇంగ్లాండ్‌ కొవిడ్‌ నియమాల ప్రకారం క్వారంటైన్‌ అవసరం లేదు కాబట్టి అవసరమైతే టెస్టు మ్యాచ్‌కు మయాంక్‌ అందుబాటులో ఉంటాడు’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని