అందుకే రుతురాజ్‌ను పంపలేదు: హార్దిక్‌

ఐర్లాండ్‌తో తొలి టీ20లో మొదట ఫీల్డింగ్‌ చేసిన ఓపెనర్‌ రుతురాజ్‌కు పిక్క కండరాలు పట్టేయడంతో తనను బ్యాటింగ్‌కు పంపలేదని కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య వెల్లడించాడు. ఇషాన్‌, దీపక్‌ హుడా ఇన్నింగ్స్‌ ఆరంభించారు. ‘‘రుతురాజ్‌కు పిక్క కండరాలు పట్టేశాయి.

Published : 28 Jun 2022 01:29 IST

డబ్లిన్‌: ఐర్లాండ్‌తో తొలి టీ20లో మొదట ఫీల్డింగ్‌ చేసిన ఓపెనర్‌ రుతురాజ్‌కు పిక్క కండరాలు పట్టేయడంతో తనను బ్యాటింగ్‌కు పంపలేదని కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య వెల్లడించాడు. ఇషాన్‌, దీపక్‌ హుడా ఇన్నింగ్స్‌ ఆరంభించారు. ‘‘రుతురాజ్‌కు పిక్క కండరాలు పట్టేశాయి. అతణ్ని ఓపెనింగ్‌లో పంపించవచ్ఛు కానీ నాకది సరేననిపించలేదు. ఆటగాడి క్షేమం ముఖ్యం. అందుకే మ్యాచ్‌లో ఏమైనా సరే చూసుకోగలమని అనిపించింది. అందుకే తనను బ్యాటింగ్‌కు పంపలేదు. ఆ నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువగా ఆలోచించలేదు. దీంతో బ్యాటింగ్‌ ఆర్డర్లో అందరం ఓ స్థానం పైన వచ్చాం. అదేం పెద్ద తలనొప్పి కాదు’’ అని అతను చెప్పాడు. గత మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఉమ్రాన్‌ లాంటి ప్రతిభావంతులకు కుదురుకునేందుకు కావాల్సినంత సమయం ఇవ్వాలని హార్దిక్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘ఉమ్రాన్‌తో మాట్లాడే ఆ మ్యాచ్‌లో కాస్త ఆలస్యంగా బంతి అందించా. బంతి కాస్త పాతబడ్డాక అతను సౌకర్యవంతంగా బౌలింగ్‌ చేయగలడు. కానీ ప్రత్యర్థి బ్యాటర్లు గొప్పగా ఆడడంతో పరుగులు ఇచ్చుకున్నాడు. అతనికి మరో అవకాశం వస్తుందని ఆశిస్తున్నా. దేశానికి ఆడడమనేదే పెద్ద విషయం. ఈ మ్యాచ్‌ను అతను ఆస్వాదించాలని కోరుకున్నా. ఎందుకంటే అరంగేట్రమనేది ఒకేసారి జరుగుతుంది. టీ20 ప్రపంచకప్‌కు బలమైన జట్టుతో దిగాలనే ఆటగాళ్లకు అవకాశాలిస్తున్నాం. నేరుగా ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ ఆడేలా కాకుండా.. అంతకంటే ముందే వాళ్లు జట్టులో కుదురుకోవాలి’’ అని పాండ్య పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని