భారత్‌పైనా అదే దూకుడు

గత ఏడాది అయిదు టెస్టుల సిరీస్‌లో అసంపూర్ణంగా ఉన్న చివరి టెస్టునే ఇప్పుడు ఆడబోతున్నాయి భారత్‌, ఇంగ్లాండ్‌. ఆ సిరీస్‌లో టీమ్‌ఇండియా 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. అప్పటికి ఇప్పటికి ఇంగ్లిష్‌ జట్టు ఆటలో చాలా మార్పు వచ్చింది.

Published : 29 Jun 2022 02:41 IST

లీడ్స్‌: గత ఏడాది అయిదు టెస్టుల సిరీస్‌లో అసంపూర్ణంగా ఉన్న చివరి టెస్టునే ఇప్పుడు ఆడబోతున్నాయి భారత్‌, ఇంగ్లాండ్‌. ఆ సిరీస్‌లో టీమ్‌ఇండియా 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. అప్పటికి ఇప్పటికి ఇంగ్లిష్‌ జట్టు ఆటలో చాలా మార్పు వచ్చింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ న్యూజిలాండ్‌పై 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి ఈ మ్యాచ్‌కు సిద్ధమవుతోంది ఇంగ్లాండ్‌. కివీస్‌పై ఎలాంటి దృక్పథంతో ఆడామో.. భారత్‌పైనా అలాగే ఆడతామని అంటున్నాడు ఆ జట్టు కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌. ‘‘నేనిప్పుడు చెబుతున్న మాటను నమ్మండి. మేం తర్వాత తలపడబోయేది వేరే ప్రత్యర్థితో. ఆ జట్టు పూర్తి భిన్నం. వారి ఆటగాళ్లు భిన్నం. కానీ ఇప్పుడు ఎలా దూకుడైన దృక్పథంతో ఆడామో.. వారి మీదా ఇలాగే ఆడతాం. చివరి మూడు టెస్టుల్లో ఏం చేశామో భారత్‌తో కూడా అలాగే చేయడంపై దృష్టిసారిస్తాం’’ అని స్టోక్స్‌ చెప్పాడు. గత ఏడాది మానసిక సమస్యల కారణంగా భారత్‌తో సిరీస్‌కు స్టోక్స్‌ దూరంగా ఉన్నాడు. ఆ సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన రూట్‌ సారథ్యం వదిలేయడంతో స్టోక్స్‌ పగ్గాలందుకున్నాడు. అతడి నాయకత్వంలో ఆడిన తొలి సిరీస్‌లోనే ఇంగ్లాండ్‌.. కివీస్‌ లాంటి అగ్ర జట్టుపై సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు