గుజరాత్‌లో జాతీయ క్రీడలు

వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న జాతీయ క్రీడలను ఎట్టకేలకు నిర్వహించబోతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌- అక్టోబర్‌ మధ్యలో గుజరాత్‌లో ఈ క్రీడలు జరుగుతాయని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) కార్యదర్శి రాజీవ్‌ మెహతా

Published : 30 Jun 2022 02:35 IST

దిల్లీ: వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న జాతీయ క్రీడలను ఎట్టకేలకు నిర్వహించబోతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌- అక్టోబర్‌ మధ్యలో గుజరాత్‌లో ఈ క్రీడలు జరుగుతాయని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) కార్యదర్శి రాజీవ్‌ మెహతా బుధవారం ప్రకటించాడు. గుజరాత్‌ ఒలింపిక్‌ సంఘంతో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల నిర్వహణకు ఆసక్తి చూపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతను పేర్కొన్నాడు. ‘‘తమ రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం ఆసక్తి మేరకు ఈ క్రీడలను నిర్వహిస్తామని గుజరాత్‌ ప్రభుత్వం మాకు లేఖ రాసింది. ఆ ప్రతిపాదనను సంతోషంగా ఒప్పుకున్నాం. సెప్టెంబర్‌ నుంచి అక్టోబర్‌ మధ్యలో ఆ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ సహా అయిదారు నగరాల్లో ఈ క్రీడలు జరుగుతాయి. తేదీలను త్వరలోనే వెల్లడిస్తాం. ఎంతో ఆలస్యం తర్వాత ఈ క్రీడలు జరగబోతున్నందుకు ఆనందంగా ఉంది. త్వరలోనే సర్వసభ్య సమావేశం నిర్వహించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటాం’’ అని రాజీవ్‌ తెలిపాడు. చివరగా 2015లో కేరళలో జాతీయ క్రీడలు జరిగాయి. 2016లో గోవాలో ఈ క్రీడలు నిర్వహించాల్సింది కానీ అందుకు ఆ రాష్ట్రం తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలం కావడంతో వాయిదా పడ్డాయి. 2020 నుంచి కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని