అందుకే ఉమ్రాన్‌ చేతికి బంతి

మంచి పేస్‌తో బౌలింగ్‌ చేస్తున్నాడనే కారణంతోనే ఐర్లాండ్‌తో రెండో టీ20లో చివరి ఓవర్లో ఉమ్రాన్‌ మాలిక్‌కు బంతిని అందించానని కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య వెల్లడించాడు. ‘‘మ్యాచ్‌లో ఎలాంటి ఆందోళన చెందలేదు. ఒత్తిడికి దూరంగా ఉండాలనుకున్నా.

Published : 30 Jun 2022 02:35 IST

డబ్లిన్‌: మంచి పేస్‌తో బౌలింగ్‌ చేస్తున్నాడనే కారణంతోనే ఐర్లాండ్‌తో రెండో టీ20లో చివరి ఓవర్లో ఉమ్రాన్‌ మాలిక్‌కు బంతిని అందించానని కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య వెల్లడించాడు. ‘‘మ్యాచ్‌లో ఎలాంటి ఆందోళన చెందలేదు. ఒత్తిడికి దూరంగా ఉండాలనుకున్నా. ఉమ్రాన్‌ మంచి పేస్‌తో బౌలింగ్‌ చేస్తుండడంతో అతనికి చివరి ఓవర్లో బంతినిచ్చా. అలాంటి పేస్‌తో అతణ్ని ఎదుర్కోవడం బ్యాటర్లకు కష్టం’’ అని అతను చెప్పాడు. మంగళవారం చివరిదైన రెండో టీ20లో మొదట టీమ్‌ఇండియా 7 వికెట్లకు 225 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఛేదనలో భయపెట్టిన ఐర్లాండ్‌ చివరకు 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో ఆ జట్టు విజయానికి 17 పరుగులు అవసరం కాగా.. ఉమ్రాన్‌ 12 పరుగులిచ్చాడు. దీంతో నాలుగు పరుగుల తేడాతో గెలిచిన భారత్‌ 2-0తో సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని