జోరు సాగనీ..

టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ విజేత నీరజ్‌ చోప్రా మరో సవాలుకు సిద్ధమయ్యాడు. గురువారం స్వీడన్‌ రాజధానిలో జరిగే ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌లోనూ తన ముద్ర వేసి ఈ పోటీల్లో తొలి పతకం పట్టాలనే పట్టుదలతో ఉన్నాడు.

Published : 30 Jun 2022 02:35 IST

డైమండ్‌ లీగ్‌ బరిలో నీరజ్‌

స్టాక్‌హోమ్‌: టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ విజేత నీరజ్‌ చోప్రా మరో సవాలుకు సిద్ధమయ్యాడు. గురువారం స్వీడన్‌ రాజధానిలో జరిగే ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌లోనూ తన ముద్ర వేసి ఈ పోటీల్లో తొలి పతకం పట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. 24 ఏళ్ల ఈ జావెలిన్‌ త్రో అథ్లెట్‌ ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఫిన్లాండ్‌లో జరిగిన పావో నూర్మి క్రీడల్లో ఈటెను 89.30మీ. దూరం విసిరి సరికొత్త జాతీయ రికార్డుతో రజతం గెలిచాడు. అనంతరం కుర్టానె క్రీడల్లో ఛాంపియన్‌గా(86.60మీ) నిలిచాడు. ఇప్పుడు నాలుగేళ్లలో తొలిసారి పోటీపడుతున్న డైమండ్‌ లీగ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని