కోహ్లీని దాటిన బాబర్‌

టీమ్‌ఇండియా ఆటగాడు విరాట్‌ కోహ్లి రికార్డులను బద్దలు కొడుతూ సాగుతున్న పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ మరో ఘనత అందుకున్నాడు. కోహ్లీని వెనక్కినెట్టి అత్యధిక కాలం పాటు ప్రపంచ నంబర్‌వన్‌ టీ20 బ్యాటర్‌గా అతను రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.

Published : 30 Jun 2022 02:35 IST

దుబాయ్‌: టీమ్‌ఇండియా ఆటగాడు విరాట్‌ కోహ్లి రికార్డులను బద్దలు కొడుతూ సాగుతున్న పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ మరో ఘనత అందుకున్నాడు. కోహ్లీని వెనక్కినెట్టి అత్యధిక కాలం పాటు ప్రపంచ నంబర్‌వన్‌ టీ20 బ్యాటర్‌గా అతను రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. గతంలో కోహ్లి 1,013 రోజుల పాటు పొట్టి ఫార్మాట్లో బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. తాజాగా ఐసీసీ బుధవారం ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో తొలి స్థానాన్ని కాపాడుకున్న బాబర్‌ ఇప్పుడు కోహ్లీని అధిగమించాడు. ఐర్లాండ్‌తో సిరీస్‌లో అద్భుతంగా రాణించిన దీపక్‌ హుడా (47 నాటౌట్‌, 104) ఏకంగా 414 స్థానాలు ఎగబాకి 104వ ర్యాంకుకు చేరుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని