రెచ్చగొడుతున్నందుకే..
ఆస్ట్రేలియా టెన్నిస్ ఆటగాడు నిక్ కిర్గియోస్ వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశమైంది. వింబుల్డన్ తొలి రౌండ్లో విజయం తర్వాత అతను స్టాండ్స్‌లోని ఓ ప్రేక్షకుడి వైపు చూస్తూ ఉమ్మివేశాడు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు
వింబుల్డన్: ఆస్ట్రేలియా టెన్నిస్ ఆటగాడు నిక్ కిర్గియోస్ వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశమైంది. వింబుల్డన్ తొలి రౌండ్లో విజయం తర్వాత అతను స్టాండ్స్‌లోని ఓ ప్రేక్షకుడి వైపు చూస్తూ ఉమ్మివేశాడు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఆ వ్యక్తి తనను ఇబ్బంది పెట్టాడని కిర్గియోస్ పేర్కొన్నాడు. ‘‘చాలా కాలంగా ద్వేషం, ప్రతికూలతను చూస్తూనే ఉన్నా. అందుకే ఇక ఆ వ్యక్తిని ఉపేక్షించడం తగదనిపించింది. అతను ఎవరికీ మద్దతు ఇవ్వడానికి మ్యాచ్‌కు రాలేదు. రెచ్చగొట్టడం, అగౌరవపరచడమే పనిగా పెట్టుకున్నాడు. అది పర్వాలేదు. కానీ నేను తనకు తగిన విధంగా బదులు ఇవ్వాలి కదా. అందుకే ఇలా చేశా. ఆస్ట్రేలియాలో పెరిగిన నాకు జాతి వివక్ష అంటే ఏమిటో తెలుసు. ఆ దేశం నుంచి వచ్చిన నేను దీనిపై నిరంతర యుద్ధం చేస్తూనే ఉన్నా. కొన్ని పరిమితులు ఉంటాయని ప్రేక్షకులు మర్చిపోతారు. ఇష్టం వచ్చిన మాటలు అని వాటిని వీడియోలు తీసి నవ్వుకుంటారు. కానీ మరొకరి మనోభావాలను దెబ్బతీస్తున్నామని అనుకోరు’’ అని అతను వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్‌లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ