అప్పుడు యోధుడిలా వెళ్లాలి: హుడా

బౌలర్లకు అనుకూలమైన పరిస్థితుల్లో కొత్త బంతిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు క్రీజులోకి యోధుడిలా వెళ్లాలని టీమ్‌ఇండియా బ్యాటర్‌ దీపక్‌ హుడా అన్నాడు. టాప్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు సవాళ్లను ఎదుర్కోవడం తప్ప వేరే మార్గం

Published : 30 Jun 2022 02:35 IST

మాలహైడ్‌ (ఐర్లాండ్‌): బౌలర్లకు అనుకూలమైన పరిస్థితుల్లో కొత్త బంతిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు క్రీజులోకి యోధుడిలా వెళ్లాలని టీమ్‌ఇండియా బ్యాటర్‌ దీపక్‌ హుడా అన్నాడు. టాప్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు సవాళ్లను ఎదుర్కోవడం తప్ప వేరే మార్గం లేదని తెలిపాడు. మంగళవారం ఐర్లాండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో హుడా (104; 57 బంతుల్లో 9×4, 6×6) సెంచరీతో అదరగొట్టాడు. ‘‘అంతర్జాతీయ మ్యాచ్‌లో ఎప్పుడూ ఓపెనింగ్‌ చేయలేదు. అయితే టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌గా సవాళ్లను ఎదుర్కోవాల్సిందే. మరో దారి లేదు. వేరే మార్గం లేనప్పుడు క్రీజులోకి యోధుడిలా ఎందుకు వెళ్లకూడదు! నేను అలాగే ఆలోచిస్తా. పరిస్థితులు కూడా నాకు కలిసొచ్చాయి. అందుకు నేను సంతోషంగా ఉన్నా. నిజాయతీగా చెప్పాలంటే టీమ్‌ఇండియాలో స్థానం సంపాదించడం.. అక్కడ కొనసాగడం చాలా కష్టం. అదే సమయంలో టీమ్‌ఇండియా జెర్సీలో ఆడుతున్నప్పుడు మన గురించి కాకుండా జట్టు కోసం ఆలోచిస్తాం. స్కోరు చేసినా.. చేయకపోయినా భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమే నాకు గర్వకారణం’’ అని హుడా వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని