ఉక్రెయిన్‌ చిన్నారులకు సాయంగా

మహిళల ప్రపంచ నంబర్‌వన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ఇగా స్వైటెక్‌ పెద్ద మనసు చాటుకుంది. రష్యా యుద్ధం కారణంగా ప్రభావం చెందిన ఉక్రెయిన్‌ చిన్నారులు, టీనేజర్లను ఆదుకునేందుకు ఆమె ముందుకు వచ్చింది. వీళ్లకు సాయంగా నిలవడం కోసం నిధుల

Published : 30 Jun 2022 02:35 IST

ఛారిటీ టోర్నీ నిర్వహించనున్న స్వైటెక్‌

లండన్‌: మహిళల ప్రపంచ నంబర్‌వన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ఇగా స్వైటెక్‌ పెద్ద మనసు చాటుకుంది. రష్యా యుద్ధం కారణంగా ప్రభావం చెందిన ఉక్రెయిన్‌ చిన్నారులు, టీనేజర్లను ఆదుకునేందుకు ఆమె ముందుకు వచ్చింది. వీళ్లకు సాయంగా నిలవడం కోసం నిధుల సేకరణకు తన దేశం పోలెండ్‌లో ఓ ఛారిటీ టోర్నీ నిర్వహించనుంది. వచ్చే నెల 23న ఈ మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ జరుగుతుంది. దీనికి ఉక్రెయిన్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం ఆండ్రీ షుచెంకో ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నాడు. అదే దేశానికి చెందిన టెన్నిస్‌ ప్లేయర్‌ ఎలీనా స్వితోలిన అంపైర్‌గా వ్యవహరిస్తుంది. కనీసం 10 వేల టికెట్లైనా అమ్ముడవుతాయని నిర్వాహకులు నమ్మకంతో ఉన్నారు. ‘‘ఈ టెన్నిస్‌ మ్యాచ్‌కు భారీ సంఖ్యలో వచ్చే జనాలను కలుద్దాం. కష్టాల్లో ఉన్న వాళ్లను ఆదుకోవడంతో పాటు వాళ్లకు కొంచెం ఆనందాన్నిచ్చే దిశగా అందరినీ కలిపే ఆట బలాన్ని టీవీల ముందు చాటాలి. ఈ మ్యాచ్‌కు వచ్చే విరాళాలన్నింటినీ ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో బాధితులైన చిన్నారులు, టీనేజర్లకు సాయంగా అందిస్తాం’’ అని 21 ఏళ్ల స్వైటెక్‌ వెల్లడించింది. ప్రస్తుతం వింబుల్డన్‌లో ఆమె ఉక్రెయిన్‌ జెండా రంగులున్న పిన్‌ను ధరించి ఆడుతోంది. రష్యా యుద్ధం మొదలెట్టిన తర్వాత 40 లక్షలకు పైగా ఉక్రెయిన్‌ ప్రజలు పోలెండ్‌కు శరణార్థులుగా వలస వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని