90 మీటర్ల దూరాన్ని అందుకుంటా

జోరుమీదున్న భారత జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా ఈ ఏడాది 90 మీటర్ల దూరాన్ని అందుకుంటాననే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

Updated : 02 Jul 2022 09:03 IST

స్టాక్‌హోమ్‌: జోరుమీదున్న భారత జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా ఈ ఏడాది 90 మీటర్ల దూరాన్ని అందుకుంటాననే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ‘‘డైమండ్‌ లీగ్‌లో మొదటి త్రో తర్వాత 90మీ. దూరాన్ని అందుకుంటాననుకున్నా. కానీ కుదర్లేదు. ఈ ఏడాది ఆ లక్ష్యాన్ని చేరుకుంటా. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు ఇప్పటివరకూ ఒక్క పతకమే (అంజూ 2003లో లాంగ్‌జంప్‌ కాంస్యం) దక్కింది కాబట్టి నాపై రాణించాలనే ఒత్తిడి ఉంటుంది. దాని గురించి ఆలోచించను’’ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని