బోణీ కొట్టిన భారత్‌

శ్రీలంకపై టీ20 సిరీస్‌ నెగ్గిన భారత మహిళల జట్టు మూడు వన్డేల సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. శుక్రవారం తొలి మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించింది.

Updated : 02 Jul 2022 09:00 IST

పల్లెకెలె: శ్రీలంకపై టీ20 సిరీస్‌ నెగ్గిన భారత మహిళల జట్టు మూడు వన్డేల సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. శుక్రవారం తొలి మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన లంక 48.2 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌటైంది. దీప్తిశర్మ (3/25), రేణుక సింగ్‌ (3/29) ప్రత్యర్థిని కట్టడి చేశారు. టీమ్‌ఇండియా తరఫున ఎనిమిది మంది బౌలింగ్‌ చేయడం విశేషం. భారత్‌ 38 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఛేదనలో భారత్‌ 17 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (4), యాస్తిక (1) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. ఈ స్థితిలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (44; 63 బంతుల్లో 3×4).. షెఫాలివర్మ (35; 40 బంతుల్లో 1×4, 2×6), హర్లీన్‌ డియోల్‌ (34; 40 బంతుల్లో)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పింది. హర్మన్‌, హర్లీన్‌, రిచా (6) స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో 138/6తో టీమ్‌ఇండియా ఇబ్బందుల్లో పడ్డట్టు అనిపించింది. ౖకానీ దీప్తి (22 నాటౌట్‌).. పూజ (21 నాటౌట్‌)తో కలిసి జట్టును గెలిపించింది. లంక బౌలర్లలో ఇనోక(4/39) రాణించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని