Published : 02 Jul 2022 03:53 IST

జకోవిచ్‌ జోరు

జాబెర్‌ ముందంజ

జకోవిచ్‌ అదరహో. సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ ఈ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ వింబుల్డన్‌ ప్రిక్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్‌ జాబెర్‌ నాలుగో రౌండ్‌ చేరగా.. అయిదో సీడ్‌ సకారికి షాక్‌ తగిలింది. 

లండన్‌

ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) వింబుల్డన్‌ ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించాడు. శుక్రవారం మూడో రౌండ్లో అతడు 6-0, 6-3, 6-4తో కెమనోవిచ్‌ (సెర్బియా)పై నెగ్గాడు. తొలి సెట్‌ను అలవోకగా చేజిక్కించుకున్నాక.. జకోవిచ్‌కు కాస్త ప్రతిఘటన ఎదురైంది. తియాఫో (అమెరికా), సాక్‌ (అమెరికా) కూడా ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించారు. మూడో రౌండ్లో తియాఫో 3-6, 7-6 (7-1), 7-6 (7-3), 6-4తో బబ్లిక్‌ (అర్జెంటీనా)పై నెగ్గగా.. సాక్‌ 6-4, 6-4, 3-6, 7-6 (7-1)తో క్రెసీ (అమెరికా)ను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో రిజ్తోవెన్‌ (నెదర్లాండ్స్‌) 6-4, 6-3, 6-4తో బసిలష్విలి (జార్జియా)పై, కుబ్లర్‌ (బ్రిటన్‌) 6-3, 6-4, 6-4తో నొవాక్‌ (ఆస్ట్రియా)పై, గొఫిన్‌ (బెల్జియం) 4-6, 7-5, 6-2, 7-5తో హంబర్ట్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచారు. అల్కరాజ్‌ కూడా ప్రిక్వార్టర్స్‌ చేరాడు. రెండో రౌండ్లో నాదల్‌ (స్పెయిన్‌) 6-4, 6-4, 4-6, 6-3తో బెరాంకిస్‌ను ఓడించాడు.

సకారికి షాక్‌: మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్‌ జాబెర్‌ ప్రిక్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. మూడో రౌండ్లో ఆమె 6-2, 6-3తో పారీ (ఫ్రాన్స్‌)ను చిత్తుగా ఓడించింది. మరోవైపు అయిదో సీడ్‌ సకారి (గ్రీస్‌)కు షాక్‌ తగిలింది. మూడో రౌండ్లో ఆమె 3-6, 5-7తో మారియా (జర్మనీ) చేతిలో పరాజయంపాలైంది. మాజీ నంబర్‌వన్‌ కెర్బర్‌ (జర్మనీ) కథ కూడా ముగిసింది మూడో రౌండ్లో మెర్టెన్స్‌ (బెల్జియం) 6-4, 7-5తో కెర్బర్‌పై విజయం సాధించింది. ఒస్తాపెంకో (లాత్వియా), హెదర్‌ వాట్సన్‌ (బ్రిటన్‌) నాలుగో రౌండ్‌కు చేరుకున్నారు. ఒస్తాపెంకో, వాట్సన్‌ ముందంజ వేశారు.


13729

జాన్‌ ఇస్నర్‌ (అమెరికా) కెరీర్‌లో కొట్టిన ఏస్‌లు. అత్యధిక ఏస్‌లు సంధించిన ఆటగాడిగా అతడు కార్లోవిచ్‌ (క్రొయేషియా 13,728) రికార్డును అధిగమించాడు. వింబుల్డన్‌లో సినర్‌ (ఇటలీ)తో పోరులో 54 ఏస్‌లు కొట్టిన ఇస్నర్‌ ఆ క్రమంలోనే ఈ రికార్డును అందుకున్నాడు.

 


మిక్స్‌డ్‌లో సానియా జోడీ శుభారంభం

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సానియా మీర్జా, పవిచ్‌ (క్రొయేషియా) జంట రెండో రౌండ్లో అడుగుపెట్టింది. మొదటి రౌండ్లో ఈ జోడీ 6-4, 3-6, 7-6 (10-3)తో హెర్నాండెజ్‌ (స్పెయిన్‌), దలమిజె (జార్జియా) ద్వయాన్ని ఓడించింది. సానియా, పవిచ్‌ జోడీ ఈ మ్యాచ్‌లో 13 ఏస్‌లు, 23 విన్నర్లు కొట్టింది. ప్రత్యర్థి జోడీ ఏకంగా తొమ్మిది డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని