Published : 03 Jul 2022 04:00 IST

బౌలర్లను మానసికంగా దెబ్బ తీసేందుకే..

బర్మింగ్‌హామ్‌: బౌలర్లను మానసికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఎదురు దాడి చేశానని పంత్‌ వెల్లడించాడు. ఇంగ్లాండ్‌తో అయిదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులతో అతను టీమ్‌ఇండియాను ఆదుకున్న సంగతి తెలిసిందే. ‘‘ఇంగ్లాండ్‌ పరిస్థితుల్లో ఓ బౌలర్‌ ఉత్తమంగా బౌలింగ్‌ చేస్తున్నాడంటే.. అతని లయను దెబ్బతీయడం చాలా ముఖ్యం. నేనూ అదే అనుకున్నా. ఒకేలా కాకుండా విభిన్న షాట్లు ప్రయత్నిస్తూ బ్యాటింగ్‌ చేస్తా. కొన్ని సార్లు ముందుకు వచ్చి, మరికొన్ని సార్లు బ్యాక్‌ఫుట్‌పై.. ఇలా క్రీజును వాడుకుంటా. ఇదంతా బౌలర్‌ను మానసికంగా దెబ్బతీయడంలో భాగమే. ఇదేదో ముందస్తు ప్రణాళిక కాదు. బౌలర్లు ఏం చేయాలని ప్రయత్నిస్తున్నారోననే దానిపై దృష్టి సారించా. ఆరంభంలోనే వికెట్లు పడ్డప్పుడు కుదురుకునేందుకు సమయం తీసుకోవాలి. జడేజాతో భాగస్వామ్యం నమోదు చేసేందుకు ప్రయత్నించా. టీ విరామం కంటే ముందు మరో వికెట్‌ కోల్పోకూడదనుకున్నాం. ఇతర విషయాల గురించి ఆలోచించకుండా బంతిపై దృష్టి పెట్టమని కోచ్‌ ద్రవిడ్‌ చెప్పాడు. మొదట్లో ఒత్తిడిగా అనిపించినా ప్రక్రియపైనే ధ్యాస పెట్టా. ప్రత్యర్థి ఏం ఆలోచిస్తుందోనని కాకుండా ఓ ఆటగాడిగా నేనేం చేయగలనో అది చేశా’’ అని పంత్‌ తెలిపాడు. తన డిఫెన్స్‌ను మెరుగుపర్చుకునేందుకు కృషి చేశానని అతనన్నాడు. ‘‘నేను ఎవరి బౌలింగ్‌లోనైనా ఎదురు దాడి చేయగలనని, కానీ డిఫెన్స్‌ మీద ధ్యాస పెట్టాలని గతంలో నా కోచ్‌ తారక్‌ సిన్హా చెప్పాడు. ఈ ఇన్నింగ్స్‌లో ప్రతి బంతిపై దృష్టి పెట్టి అందుకు అనుగుణంగా ఆడా. మంచి బంతిని గౌరవించడం శుభ సూచిక. నా ఆటపై దృష్టి సారించినంతగా డిఫెన్స్‌ను పట్టించుకోను. కొన్ని సార్లు విభిన్న షాట్లు ఆడొచ్ఛు కానీ ఏదేమైనా వంద శాతం ప్రదర్శన ఇవ్వాలనే అనుకుంటా. బంతిని బాదాలనుకుంటే బాదేస్తా. కొంతకాలంగా అదే చేస్తున్నా. అది నాకెంతో ఉపయోగపడుతోంది’’ అని అతను పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని