Mithali raj: ప్రధాని మాటలతో ఉప్పొంగిపోయా: మిథాలీరాజ్‌

ఆటకు తాను చేసిన కృషిని గుర్తించి ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన ఆలోచనాత్మక మాటలతో పొంగిపోయానని క్రికెట్‌ దిగ్గజం మిథాలీ రాజ్‌ సంతోషం వ్యక్తం చేసింది. 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలుకుతూ గత నెలలో ఆమె ఆటకు వీడ్కోలు పలికిన సంగతి

Published : 03 Jul 2022 07:48 IST

దిల్లీ: ఆటకు తాను చేసిన కృషిని గుర్తించి ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన ఆలోచనాత్మక మాటలతో పొంగిపోయానని క్రికెట్‌ దిగ్గజం మిథాలీ రాజ్‌ సంతోషం వ్యక్తం చేసింది. 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలుకుతూ గత నెలలో ఆమె ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిథాలీ కృషిని ప్రశంసిస్తూ ఆమెకు మోదీ లేఖ రాశారు. దీనికి స్పందించిన ఆమె.. ‘‘స్ఫూర్తి దాత అయిన గౌరవ ప్రధాని మోదీ నుంచి ఇలాంటి ప్రోత్సాహం పొందడం నాకు దక్కిన గౌరవం. క్రికెట్‌కు నా సేవల పట్ల ఆయన ఆలోచనాత్మక వ్యాఖ్యలు నన్ను ఉప్పొంగిపోయేలా చేశాయి. దేశంలో క్రీడల వృద్ధిలో ప్రధాని నాపై పెట్టుకున్న అంచనాలను అందుకునేలా కష్టపడతా’’ అని శనివారం ట్వీట్‌ చేసింది. మిథాలీకి రాసిన లేఖలో ప్రధాని.. ‘‘ప్రతిభ, స్థిరత్వం, ఎప్పటికప్పుడూ ఆటను మార్చుకుంటూ సాగే తత్వం నీకు ఉండడం అదృష్టం. ఈ ఉత్సాహం ఎంతోమంది క్రీడాకారుల్లో స్ఫూర్తికి కారణమైంది. నీ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టావు. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలవడం నీ సామర్థ్యాన్ని చాటుతోంది. హద్దుల గోడలు బద్దలుకొట్టి ఎంతోమందికి ప్రేరణనిచ్చావు’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని