సాహాకు క్యాబ్‌ ఎన్‌ఓసీ

టీమ్‌ఇండియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ సాహా, బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) మధ్య 15 ఏళ్ల బంధానికి తెరపడింది. బెంగాల్‌ జట్టును వీడిన అతనికి నిరభ్యంతర పత్రాన్ని (ఎన్‌ఓసీ)ని క్యాబ్‌ జారీ చేసింది. ‘‘తనకు నిరభ్యంతర

Published : 03 Jul 2022 04:00 IST

కోల్‌కతా: టీమ్‌ఇండియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ సాహా, బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) మధ్య 15 ఏళ్ల బంధానికి తెరపడింది. బెంగాల్‌ జట్టును వీడిన అతనికి నిరభ్యంతర పత్రాన్ని (ఎన్‌ఓసీ)ని క్యాబ్‌ జారీ చేసింది. ‘‘తనకు నిరభ్యంతర పత్రాన్ని జారీ చేయాలని క్యాబ్‌ అధ్యక్షుడు అవిషేక్‌ దాల్మియాకు సాహా దరఖాస్తు చేసుకున్నాడు. అతని విన్నపాన్ని మన్నించి మరో రాష్ట్రానికి ఆడేందుకు వీలుగా ఎన్‌ఓసీ ఇచ్చాం’’ అని క్యాబ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. 2007లో హైదరాబాద్‌తో మ్యాచ్‌లో బెంగాల్‌ తరపున అరంగేట్రం చేసిన సాహా.. 122 ఫస్ట్‌క్లాస్‌, 102 లిస్ట్‌- ఏ మ్యాచ్‌లాడాడు. ఇటీవల తన అంకితభావాన్ని ప్రశ్నించిన క్యాబ్‌ సంయుక్త కార్యదర్శి దేబబ్రత దాస్‌ తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని సాహా డిమాండ్‌ చేస్తూ జట్టును వీడాడు. మరోవైపు అతను త్రిపురకు ఆటగాడితో పాటు మార్గనిర్దేశకుడిగానూ వ్యవహరించేలా ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని