భారత్‌ 1.. ఇంగ్లాండ్‌ 1

మహిళల హాకీ ప్రపంచకప్‌ను భారత్‌ డ్రాతో మొదలుపెట్టింది. ఆదివారం జరిగిన పూల్‌-బి మ్యాచ్‌లో భారత్‌ 1-1 గోల్స్‌తో ఇంగ్లాండ్‌తో డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి ఇంగ్లాండ్‌ దూకుడుగా ఆడింది. 8వ నిమిషంలో పీటర్‌ ఇసాబెల్‌ కొట్టిన ఫీల్డ్‌ గోల్‌తో ఆ జట్టు ఆధిక్యంలో నిలిచింది.

Published : 04 Jul 2022 03:53 IST

మహిళల హాకీ ప్రపంచకప్‌

ఆమ్‌స్టీల్‌వీన్‌ (నెదర్లాండ్స్‌): మహిళల హాకీ ప్రపంచకప్‌ను భారత్‌ డ్రాతో మొదలుపెట్టింది. ఆదివారం జరిగిన పూల్‌-బి మ్యాచ్‌లో భారత్‌ 1-1 గోల్స్‌తో ఇంగ్లాండ్‌తో డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి ఇంగ్లాండ్‌ దూకుడుగా ఆడింది. 8వ నిమిషంలో పీటర్‌ ఇసాబెల్‌ కొట్టిన ఫీల్డ్‌ గోల్‌తో ఆ జట్టు ఆధిక్యంలో నిలిచింది. అయితే 27వ నిమిషంలో వందన కటారియా బంతిని గోల్‌ పోస్టులోకి పంపడంతో స్కోర్లు సమమయ్యాయి. అక్కడ నుంచి రెండు జట్లు హోరాహోరీ తలపడ్డాయి. పలుసార్లు గోల్స్‌ చేసే అవకాశాలను కూడా దక్కించుకున్నా సద్వినియోగం చేసుకోలేకపోయాయి. టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక పోరులో ఇంగ్లాండ్‌ చేతిలో ఓడిన మన జట్టు.. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకుంటుందని భావించినా.. త్రుటిలో ఆ అవకాశం చేజారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని