సిరీస్‌పై అమ్మాయిల కన్ను

శ్రీలంకపై మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ గెలిచి జోరు మీదున్న భారత మహిళల జట్టు సిరీస్‌పై కన్నేసింది. సోమవారం జరిగే రెండో వన్డేలో నెగ్గి మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ దక్కించుకోవాలని హర్మన్‌ప్రీత్‌ బృందం భావిస్తోంది. తొలి వన్డేలో గెలిచినా ఓపెనర్లు స్మృతి మంధాన,

Published : 04 Jul 2022 03:53 IST

లంకతో భారత్‌ రెండో వన్డే నేడే  

పల్లెకెలె: శ్రీలంకపై మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ గెలిచి జోరు మీదున్న భారత మహిళల జట్టు సిరీస్‌పై కన్నేసింది. సోమవారం జరిగే రెండో వన్డేలో నెగ్గి మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ దక్కించుకోవాలని హర్మన్‌ప్రీత్‌ బృందం భావిస్తోంది. తొలి వన్డేలో గెలిచినా ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలివర్మ ఆశించినంత రాణించకపోవడం జట్టును కలవరపెడుతోంది. కుదురుకున్నాక ఔట్‌ కావడం వీళ్లకు అలవాటుగా మారింది. టీ20 సిరీస్‌లోనూ ఈ జోడీ స్థిరంగా ఆడలేదు. ఈ నేపథ్యంలో మూడో వన్డేలో ఈ ఓపెనర్లు చెలరేగాలని భారత్‌ కోరుకుంటోంది. బ్యాటింగ్‌తో పోలిస్తే పర్యటన ఆసాంతం బౌలింగ్‌లో భారత్‌ అదరగొడుతోంది. దీప్తి శర్మతో పాటు పేసర్‌ రేణుక సింగ్‌, పూజ సత్తా చాటుతున్నారు. కెప్టెన్‌ హర్మన్‌ బౌలింగ్‌లోనూ ఓ చేయి వేస్తోంది. ఇప్పటికే భారత్‌కు టీ20 సిరీస్‌ను కోల్పోయిన శ్రీలంక ఎక్కువగా కెప్టెన్‌ చమరి ఆటపట్టుపైనే ఆధారపడుతోంది. సిరీస్‌లో ఆశలు నిలవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి అయిన నేపథ్యంలో లంక పోరాడడం ఖాయం. అయితే ఆ జట్టు భారత్‌కు గట్టిపోటీ ఇవ్వాలంటే చమరి ఆటపట్టు, ఇనోక రణవీరలకు కవిషా, విష్మి గుణరత్నే, ఒషాడి రణసింఘేల నుంచి మద్దతు అవసరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని