రోహిత్‌కు నెగెటివ్‌

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ రోహిత్‌శర్మకు నెగెటివ్‌ వచ్చింది. కరోనా కారణంగా ఇప్పటిదాకా ఐసొలేషన్‌లో ఉన్న రోహిత్‌కు ఆదివారం ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష నిర్వహించగా నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. లెస్టర్‌తో వార్మప్‌ మ్యాచ్‌ సందర్భంగా రెండో రోజు రోహిత్‌కు కరోనా ఉన్నట్లు తేలింది.

Published : 04 Jul 2022 03:53 IST

బర్మింగ్‌హామ్‌: భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ రోహిత్‌శర్మకు నెగెటివ్‌ వచ్చింది. కరోనా కారణంగా ఇప్పటిదాకా ఐసొలేషన్‌లో ఉన్న రోహిత్‌కు ఆదివారం ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష నిర్వహించగా నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. లెస్టర్‌తో వార్మప్‌ మ్యాచ్‌ సందర్భంగా రెండో రోజు రోహిత్‌కు కరోనా ఉన్నట్లు తేలింది. అప్పటి నుంచి ఐసొలేషన్‌లోనే ఉన్న అతడు.. ఇంగ్లాండ్‌తో అయిదో టెస్టుకు దూరమయ్యాడు. జులై 7న ఆరంభమయ్యే టీ20 సిరీస్‌కు రోహిత్‌ అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి. ప్రస్తుతం నెగెటివ్‌ వచ్చినా.. కొవిడ్‌ అనంతరం ఊపిరితిత్తుల పనితీరు ఎలా ఉందో కూడా తెలుసుకోవడం కోసం అతడికి పరీక్షలు చేయనున్నారు. రోహిత్‌ గైర్హాజరీ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో ఆఖరి టెస్టులో బుమ్రా భారత్‌కు నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని