మెరిసిన మంధాన, షెఫాలి

శ్రీలంకపై ఇప్పటికే టీ20 సిరీస్‌ కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు.. వన్డే సిరీస్‌నూ సొంతం చేసుకుంది. సోమవారం రెండో వన్డేలో హర్మన్‌ప్రీత్‌ బృందం 10 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసి మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను గెలుచుకుంది.

Published : 05 Jul 2022 02:56 IST

లంకపై వన్డే సిరీస్‌ భారత్‌ కైవసం

పల్లెకెలె: శ్రీలంకపై ఇప్పటికే టీ20 సిరీస్‌ కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు.. వన్డే సిరీస్‌నూ సొంతం చేసుకుంది. సోమవారం రెండో వన్డేలో హర్మన్‌ప్రీత్‌ బృందం 10 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసి మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను గెలుచుకుంది. మొదట లంక 50 ఓవర్లలో 173 పరుగులే చేయగలిగింది. కాంచన (47 నాటౌట్‌), నీలాక్షి డిసిల్వా (32) రాణించారు. భారత బౌలర్లలో రేణుక సింగ్‌ (4/28), మేఘన సింగ్‌ (2/43), దీప్తిశర్మ (2/30) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఛేదనలో ఓపెనర్లు మంధాన (94 నాటౌట్‌; 83 బంతుల్లో 11×4, 1×6), షెఫాలి (71 నాటౌట్‌; 71 బంతుల్లో 4×4, 1×6) చెలరేగి ఆడారు. వీళ్లిద్దరూ పోటీపడి షాట్లు కొట్టడంతో భారత్‌ ఛేదన చాలా సులభం అయిపోయింది. టీమ్‌ఇండియా 25.4 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండానే లక్ష్యాన్ని అందుకుంది. మంధాన-షెఫాలీ అబేధ్యమైన తొలి వికెట్‌కు 174 పరుగులు జోడించారు. ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్‌ గురువారం జరుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని