Dutee Chand : నన్నూ ర్యాగింగ్‌ చేశారు

సీనియర్ల చేతిలో తానూ ర్యాగింగ్‌కు గురయ్యానని భారత స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతి చంద్‌ సంచలన ఆరోపణలు చేసింది. 2006 నుంచి 2008 మధ్య స్థానిక క్రీడా హాస్టల్‌లో ఉన్న సమయంలో ఇది జరిగిందని ఆమె వెల్లడించింది. శనివారం భువనేశ్వర్‌లోని బీజేబీ కళాశాలకు చెందిన ఓ 19 ఏళ్ల వి

Updated : 05 Jul 2022 08:44 IST

భువనేశ్వర్‌: సీనియర్ల చేతిలో తానూ ర్యాగింగ్‌కు గురయ్యానని భారత స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతి చంద్‌ సంచలన ఆరోపణలు చేసింది. 2006 నుంచి 2008 మధ్య స్థానిక క్రీడా హాస్టల్‌లో ఉన్న సమయంలో ఇది జరిగిందని ఆమె వెల్లడించింది. శనివారం భువనేశ్వర్‌లోని బీజేబీ కళాశాలకు చెందిన ఓ 19 ఏళ్ల విద్యార్థిని సీనియర్ల వేధింపులు తట్టుకోలేక తన హాస్టల్‌ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. ముగ్గురు సీనియర్లు తనను మానసికంగా హింసించారంటూ ఆమె సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల బయట ఆందోళన నిర్వహించారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో స్పందించిన ద్యుతి.. తననూ సీనియర్లు ర్యాగింగ్‌ చేశారని చెప్పింది. ‘‘క్రీడా హాస్టల్‌లోని సీనియర్లు తమ శరీరాలకు మర్దన చేయమని నన్ను బలవంతం చేసేవాళ్లు. వాళ్ల దుస్తులూ ఉతకమనేవాళ్లు. నా ఆర్థిక పరిస్థితి గురించి ఎగతాళిగా మాట్లాడేవాళ్లు. ఆ విషయం గురించి హాస్టల్‌ ఇంఛార్జీకి ఫిర్యాదు చేస్తే నన్ను తిట్టేవాళ్లు’’ అని ద్యుతి తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని